చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మృతి చెందారు. పేద మరియు ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఈ కరోనా మహమ్మారి కబళించే చేస్తోంది. అయితే ఇది ఇలా ఉండగా... తాజాగా వైద్య నిపుణులు మరో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత... చిన్నపిల్లలు ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నారు అని నిపుణులు వెల్లడించారు. విద్యాసంస్థలు మూసివేయడంతో.. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటున్నారు. అలాగే లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గరే ఉంటున్నారు.

ఇంటి దగ్గర ఉన్న ఆ తల్లిదండ్రులు పిల్లల పట్ల... శ్రద్ధ చూపకపోవడంతో ఈ మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ కరోనా కారణంగా పిల్లల్లో... భయం పెరిగి పోయిందని దీంతో మానసిక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అని చెప్పారు. ఈ మానసిక సమస్యలు ఎక్కువగా మూడు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు తలెత్తుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు... కరోనా కంటే ముందు టాయిలెట్ వెళ్లాలంటే బాత్ రూమ్ లకు వెళ్లేవారని... అదే కరోనా సెకండ్ వేవ్ తర్వాత... పిల్లలు.. పడకలను తడిపేస్తున్నాయి అని వారు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ పిల్లలను తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం మానేశారని కూడా వెల్లడించారు.

అలాగే  స్కూళ్లు లేకపోవడంతో... ఆడుకోడానికి ఎవరూ లేక పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని నిపుణులు చెప్పారు. మొదట్లో చాలా దూకుడుగా ఉన్న పిల్లలు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారని కూడా సర్వేలో తేలిందని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి  కేసులు తరచూ... తమ వద్దకు వస్తున్నాయని వారు అంటున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా నెలల పాటు ఇంట్లోనే ఉండటం వల్ల ఈ మానసిక సమస్యలు తలెత్తుతాయని.... సైకియాట్రిస్ట్ వైద్యులు చెబుతున్నారు. ఇలా అందరూ ఇంట్లో ఉండటం వల్ల పిల్లలలో... తొందరగా మానసిక సమస్యలు వస్తాయని వారు అంటున్నారు. అలాగే పిల్లల శరీరం లో మార్పులతో పాటు అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: