మారుతున్న కాలం కొద్దీ మనుషులు కూడా సరికొత్త జీవనశైలికి అలవాటు పడుతున్నారు అని చెప్పవచ్చు.. నాటి కాలంలో ఆహారపు అలవాట్లతో పోలిస్తే నేటితరం ఆహారపు అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే పాత పద్ధతులే ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి అని అందరికీ తెలిసిన విషయమే.. ఇకపోతే వెనుకటి రోజులలో మన పెద్దలు తినే ఆహారమే నేడు మళ్లీ కరోనా పుణ్యమా అని వాడుక లోకి రావడం గమనార్హం. కరోనా మహమ్మారి కారణంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం ప్రస్తుతం తింటున్న ప్రతి ఆహారాన్ని పక్కన పెట్టేసి నాటి కాలంలో మన పెద్దలు ఆహారపు అలవాట్లను ప్రతి ఒక్కరు దిన చర్య లో అలవాటు చేసుకోవడం గమనార్హం.


ముఖ్యంగా ఆ కాలంలో అయితే రాగిసంకటి , జొన్న రొట్టెలను అధికంగా తినే వాళ్ళు. అందుకే వారు శరీర ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవించారు. ఇప్పుడు మళ్ళీ షుగర్ పేషెంట్లు కూడా జొన్న రొట్టెలు తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం సిటీలలో సైతం రోడ్డు సైడ్ జొన్న రొట్టెలను అమ్మడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఈ కరోనా  కాలంలో గోధుమలతో చేసిన రొట్టెలు కంటే జొన్నలతో చేసిన రొట్టెలను ఎక్కువగా తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అయితే ఈ జొన్న రొట్టెలు మనకు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చదివే తెలుసుకున్నాం.

జొన్న రొట్టెలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్ ,యాంటీఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా లభించడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా జొన్న రొట్టెలు చాలా బాగా పనిచేస్తాయి. జొన్న రొట్టెలు తినడం వల్ల వీటి ద్వారా మనకు లభించే కాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. నరాల బలహీనత తగ్గించి, రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: