ముక్క లేనిదే ముద్ద దిగదు.. ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే ఇలాంటి డైలాగులు వినిపించేవి. కానీ కరోనా వైరస్ వెలుగు  లోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో కూడా ఇదే డైలాగ్ వినిపిస్తోంది. కరోనా వైరస్ వెలుగు లోకి వచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. ఆరోగ్యాన్ని కాపాడు కోవడం  నిరోధక శక్తిని పెంచు కోవటం  ఎలా అని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమం లోనే మాంసకృత్తులు ఎక్కువగా తింటే ఆరోగ్యం గా ఉండవచ్చు అని అక్కడ ఎక్కడో సోషల్ మీడియాలో చూశారు  ఇంత చూశాక ఇక మాంసం తినకుండా ఉంటారా.. ఇక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూన్నాం అంటూ అవసరమైన దానికంటే ఎక్కువే మాంసం తినడం మొదలు పెట్టారు.


 చివరికి మాంసానికి అలవాటు పడి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు గా మారి పోయారు జనాలు.అయితే అయితే మటన్ కిలో రూ.700 వరకు పలుకుతుంది. సామాన్య ప్రజలు ఇది తరచూ తినలేరూ. అందుకే చికెన్ తినడానికి ఎక్కువగా అలవాటు పడి పోయారు. ఇక ఎవరైనా సరే చికెన్ షాప్ కి వెళ్తే విత్ స్కీన్ , స్కిన్ లెస్, బోన్ లెస్ చికెన్ కావాలి అంటూ రకరకాల ఆప్షన్లను ఎంచుకుంటూ ఉంటారు. ఒకప్పుడైతే ఇవన్ని ఉండేవి కాదు. కానీ ఇప్పట్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఇక ఇలా ఆప్షన్లను ఎంచుకుంటూ ఉండటం గమనార్హం.


 ఇంతకీ ఏది తింటే మంచిది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం చికెన్ స్కిన్ తో తినడమే మంచిది అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు. కోడి చర్మంలో ఉండే అన్శాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తపోటును నియంత్రించడం తో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తాయ్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే చికెన్ స్కిన్ తో తినడమే ఉత్తమం అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: