ప్రస్తుతం ఉన్న కాలంలో అనేక మందికి తెల్ల జుట్టు రావడం సహజం గా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. చాలామందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు దీనికి జన్యుపరమైన జుట్టు సమస్య గా భావిస్తూ ఉంటారు. అయితే కొంత మందిలో థైరాయిడ్, రక్తహీనత, పోషకాల లోపం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీన్ని వదిలించుకునే అవకాశం ఉందని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు. సూపర్ ఫుడ్స్ ని మనం తినే డైటింగ్ లో భాగం చేసుకోవడం వల్ల మీ జుట్టు సమస్య నుండి బయటపడవచ్చు తెలియజేస్తున్నారు నిపుణులు.

జుట్టు సమస్యలు తొలగి పోవాలి అంటే..B-12  విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. B-12 లోపం వల్ల వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు నెరిసిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల పాలు ,పెరుగు, పుట్టగొడుగులు తినడం మంచిది. వీటివల్ల విటమిన్ డి, B-12 పుష్కలంగా లభిస్తుంది.


ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతుంది.. మనం తప్పనిసరిగా ఆహారంలో కి మెంతులు, కొత్తిమీర, పుదీనా, బీట్ రూట్ వంటివి తినాలి. ఇందులో ముఖ్యంగా ఇనుము పుష్కలంగా లభిస్తుంది.

జుట్టు ఎప్పుడూ నల్లగా మెరిసేలా ఉండాలని ఆలోచించేవారు శరీరానికి చాలా ప్రోటీన్ న్యూట్రిషన్ అవసరం. దీనివల్ల జుట్టు ఎప్పుడూ కూడా తెల్లబడదు. మనం తినే ఆహారంలో గుడ్డు, చేపలు, పండ్లు పాల ఉత్పతులు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తినడం వల్ల జుట్టు లో ప్రోటీన్ల లోపం ఉండదు.

ఉడికించిన గుడ్ల లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు మెరుగుపరచడమే కాకుండా తెల్ల జుట్టు సమస్యలు కూడా అరికడుతుంది. ఇక పెరుగులో విటమిన్ -B-12 సమృద్ధిగా లభిస్తుంది.దీనివల్ల జుట్టు నల్లగా ఉంచడంలో చాలా మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: