కొంతమంది అమ్మాయిలకు పై పెదవి పై అవాంచిత రోమాలు వస్తుంటాయి. వాటితో ఎవరితోనైనా కలవాలన్న ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు పార్లల్ కెళ్ళి అధిక ఖర్చు పెట్టి తియంచుకోకుండా ఇంట్లోనే కొన్ని పద్ధతులను ఉపయోగించి తొలగించుకోవచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం..


 1).పసుపు, పాలు..
ఇందుకోసం పాలలో కాస్త పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదవి పై లేపణంగా వేసి అరగంట సేపు ఆరనివ్వాలి.తరవాత గోరువెచ్చని నీటితో చిన్నగా రుద్దుతూ కడగాలి. ఇలా రోజూ మార్చి రోజూ చేసుకోవడం వల్ల అవాంచిత రోమాలు తొందరగా తగ్గిపోతాయి.

2). గుడ్డు లోని తెల్ల సోన..
గుడ్డులోని తెల్లసొన గుడ్డులోని తెల్లసొనను తీసుకొని అందులో మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. దానిని ఉపయోగించడం వల్ల పెదవులపై వెంట్రుకలు తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

 పెరుగు,శనగపిండి మరియు పసుపు వేసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని పెదవులపై అప్లై చేసి అరగంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత బాగా రుద్దుతూ కడిగితే పెదవిపై వెంట్రుకలు తొలగి, మొఖం కూడా అందంగా తయారవుతుంది.

3).నిమ్మరసం, చక్కెర..
ఒక స్ఫూన్ నిమ్మరసం, రెండు స్ఫూన్ లా చక్కెర తీసుకొని కొద్దిగా వేడిచేసి ఆ మిశ్రమాన్ని పెదవి పై రాయాలి. ఆ తర్వాత వాక్స్ లాగా లాగాలి.మిశ్రమం పెదవుల జుట్టును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

4). షుగర్ వ్యాక్సింగ్..
చమోమిలే టీ బ్యాగ్‌లను పాన్‌లో వేసి,దానికి కొంచెం నీరు కలపాలి . దానిని వేడి చేస గోరువెచ్చగా వున్నప్పుడు రాయాలి. ఇది స్క్రబ్ లా పనిచేసి, అవాంచిత రొమాలను తొలగిస్తుంది.

5). బంగాళాదుంప రసం..
శనగపప్పులను రాత్రంత నానబెట్టి ఉదయాన్నే రుబ్బి, ఆ మిశ్రమానికి బంగాళాదుంపరసం ,నిమ్మరసంతో కలిపి పెదవుల వెంట్రుకలకు మర్దన చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.


6). మొక్కజొన్న పిండి, తేనే..
ఒక స్ఫూన్ మొక్కజొన్న పిండి ,రెండు స్ఫూన్ లా తేనే తీసుకొని అందులో తగినంత పాలు తీసుకొని, మిశ్రమం లా తయారుచేసి, పెదవి వెంట్రుకలపై రాయాలి. ఇది త్వరగా ,నొప్పి లేకుండా వెంట్రుకలను తొలగించడంలో మీకు సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: