డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరం. దీని కారణంగా శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇక దీనినే రక్తహీనత అని కూడా అంటారు. డెంగ్యూ జ్వరంతో బాధపడే వారిలో ఈ రక్తహీనత సమస్య కొందరిలో ఎక్కువగా ఉంటే కొందరిలో మాత్రం తక్కువగా ఉంటుంది. అయితే సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కాబట్టి డెంగ్యూజ్వరం నుండి కోలుకున్న వారు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి. దీని కోసం వారు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలు అనేవి ఎక్కువగా తయారవుతాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. మాంసం, గుడ్లు, పాలు ఇంకా పాల ఉత్పత్తులు, చేపలు, కాయగూరలు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకోవాలి.ఇక మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను మన శరీరం గ్రహించాలంటే మన శరీరంలో తగినంత విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి తగినంత ఉండేనే మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ ను మన శరీరం ఈజీగా గ్రహిస్తుంది. ఇంకా అలాగే విటమిన్ సి ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.


నిమ్మజాతికి చెందిన పండ్లను, టమాటాలను ఇంకా బెర్రీలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాల అభివృద్దిలో మనకు ఫోలెట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఫోలెట్ మనకు సహాయపడుతుంది. ఆకుకూరలు, తృణధాన్యాలు, బీన్స్ ఇంకా కాయధాన్యాలు వంటి వాటిని తీసుకోవడంవల్ల శరీరానికి తగినంత ఫోలెట్ లభిస్తుంది.ఇంకా అదే విధంగా న్యూరనాల్ పని తీరులో, ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో కూడా విటమిన్ బి 12 కూడా మనకు సహాయపడుతుంది.గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు ఇంకా మాంసం వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ బి 12 లభిస్తుంది. అంతేకాకుండా డెంగ్యూ జ్వరం నుండి కోలుకున్న వారు ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం వల్ల తలెత్తే రక్తహీనత సమస్య తగ్గడంతో పాటు చాలా త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: