షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది. మనం రోజూ తయారు చేసే వంటల్లో పసుపును చాలా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులోకి వస్తుంది.ఇంకా అలాగే రాత్రి పాత్రలో నిల్వ చేసిన నీటిని తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే గుణం రాగి పాత్రలకు ఉంది. కాబట్టి రాగి పాత్రలో రాత్రంతా నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల క్రమంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారు మెంతులను వాడడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.రాత్రంతా కూడా నీటిలో నానబెట్టిన మెంతులను తిని ఆ నీటిని తాగాలి. లేదంటే మొలకెత్తిన మెంతులను నేరుగా కూడా తినవచ్చు. ఇంకా అలాగే నీటిలో మెంతి పిండి కలుపుకుని తాగవచ్చు. ఇలా ఎలా తీసుకున్న కూడా షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉంటుంది. ఇంకా అలాగే టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారు అల్లం టీని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఆయుర్వేదం ప్రకారం శరీరంలో వ్యాధులను తగ్గించే గుణం అల్లానికి ఉంది. మన వంటల్లో అల్లాన్ని వాడడంతో పాటు అల్లంతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది.


ఇంకా అలాగే మనం వాడే మసాలాలలో ఒకటైన దాల్చిన చెక్కను వాడడం వల్ల కూడా షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. దాల్చిన చెక్కతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అదే విధంగా కాకరకాయలకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం ఉంది. కాబట్టి వీటిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఇంకా అలాగే ఆహారంలో భాగంగా నల్ల శనగలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి.అలాగే నేరేడు పండ్లను వాటి ఆకులను నమిలి తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇంకా అదే విధంగా ఉసిరికాయ జ్యూస్ ను లేదా ఉసిరికాయను ముక్కలుగా చేసి నమిలి తిన్నా కూడా షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉంటుంది. ఇక ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఎల్లప్పుడూ అదుపులో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: