యోగాలో కొన్ని ఈజీగా వేయదగిన ఆసనాలు ఉన్నాయి. అయితే వాటిల్లో భుజంగాసనం కూడా ఒకటి. మన సంస్కృతంలో భుజంగ అనే పదానికి పాము అని అర్థం వస్తుంది. ఇక పాము పడగ విప్పినప్పుడు ఎలాగైతే ఆకారంలో ఉంటుందో.. సరిగ్గా అదే ఆకారంలో ఈ ఆసనాన్ని మనం వేయాల్సి ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే భుజంగాసనాన్ని ఎలా వేయాలి.. దీంతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనం పొందవచ్చు.. వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మ్యాట్ పై బోర్లా పడుకోవాలి. ఆ తరువాత చేతులపై నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకి లేపాలి. ఆ తరువాత తలను పైకెత్తి చూడాలి. పడగ విప్పిన పాము ఆకారంలో ఈ ఆసనం రావాలి. ఇక ఈ భంగిమలో 5 నిమిషాల పాటు ఉండాలి.ఆ తరువాత మళ్లీ మామూలు స్థితికి రావాలి.ఇక ఇలా ఈ ఆసనాన్ని ఆరంభంలో రోజూ కనీసం 5 నిమిషాల పాటు అయినా సరే వేయాలి. ఆ తరువాత సౌకర్యాన్ని బట్టి ఈ ఆసనం సమయాన్ని పెంచుతూ పోవచ్చు. ఇలా ఈ ఆసనాన్ని ప్రతి రోజూ వేయడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.


మనం ఈ భుజంగాసనం వేయడం వల్ల భుజాలు, మెడ భాగాల్లో ఉండే దృఢత్వం పోతుంది. అందువల్ల ఆ భాగాల్లో ఉండే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారికి భుజాలు, మెడ భాగాలు నొప్పిగా ఉంటాయి. అలాంటి వారు ఈ ఆసనం వేస్తే నొప్పుల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇంకా అలాగే ఈ ఆసనం వేయడం వల్ల ఛాతి, పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి. ఆస్తమా, దగ్గు, జలుబు ఉన్నవారికి చాలా మేలు జరుగుతుంది.అలాగే పొత్త కడుపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది.ఒక నెల రోజుల పాటు ఈ ఆసనాన్ని వేస్తే వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ఇక ఈ ఆసనం వేయడం వల్ల వెన్నెముక కూడా చాలా దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చేతుల్లో బాగా నొప్పి ఉన్నవారు ఇంకా దృఢత్వం లేని వారు ఈ ఆసనాన్ని వేయకూడదు. మిగిలిన ఎవరైనా సరే ఈ ఆసనాన్ని వేసి చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: