ఎన్నో ఔషధ గుణాలు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న మొక్కలల్లో అతి మధురం మొక్క కూడా ఒకటి. దీనినే ములేతి అని కూడా అంటూ ఉంటారు.ఈ అతి మధురం మొక్క వేరును మనం ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటాము. ఈ మొక్క వేరు ఇంకా వేరు పొడి మనకు ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో సులభంగా లభిస్తుంది. చాలా కాలంగా ఆయుర్వేదంలో దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అతి మధురాన్ని ఉపయోగించడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంకా శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో ఇలా చాలా రకాలుగా అతి మధురం మనకు సహయపడుతుంది.ఈ అతి మధురం వేరుతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అతిమధురం వేరుతో టీని తయారు చేసి రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. ఇంకా అలాగే నీటిలో అతిమధురం వేరును వేసి బాగా మరిగించాలి. ఆ తరువాత ఈనీటితో ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి.


ఊపిరి తీసుకోవడం కూడా సులభం అవుతుంది. ఇంకా అలాగే అతిమధురం టీని భోజనం చేసిన తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణమవుతుంది.అలాగే వివిధ రకాల జీర్ణ సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అలాగే ఈ టీని తాగడం వల్ల శరీర బరువు ఈజీగా అదుపులో ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే అతిమధురం వేరుతో టీని తయారు చేసి తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంకా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ఇంకా ఈ టీని తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు ఇంకా చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ అతిమధురం మొక్క నుండి నూనెను కూడా తీస్తారు. ఈ నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. చర్మ సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే గిన్నెలో తేనె, పెరుగు, అతిమధురం పొడి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల  చర్మ సమస్యలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: