ఈమధ్య కాలంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు.మరి ముఖ్యంగా స్త్రీలలో బరువు,ఉబబకాయం సమస్య మరింత పీడిస్తూ ఉంది.
 మీరు పదిమందిలో కలిసిన కూడా,వీరి ఆహారం పైనే ఎక్కువగా కామెంట్లు చేస్తూ,అతిగా ఆహారం తీసుకోవడం వల్లనే లావు అవుతున్నారని హేళన చేస్తూ ఉంటారు.కానీ స్త్రీలు అధికంగా బరువు పెరగడానికి కేవలం ఆహార అలవాట్లే కాక,రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా బరువు ఎక్కడానికి దోహదపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక సాటి మనిషిని ఏ విధంగాను బాధపెట్టడం అస్సలు సంభావ్యం కాదని కూడా సూచిస్తున్నారు.
అసలు స్త్రీలు అధిక బరువు పెరగడానికి అసలైన కారణాలు మనము తెలుసుకుందాం పదండి..

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్..

హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా అధికంగా లావుగా తయారవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్‌ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. దానితో స్త్రీలలో పీసీఓఎస్‌కి దారితీస్తుందని,దానివల్ల బరువు పెరగడం,పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, మొటిమలు,జుట్టు రాలడం,అన్వాంటెడ్ హెయర్ సమస్య ఎక్కువవడం,మూడ్‌ స్వింగ్స్‌ వంటి సమస్యలు మొదలవుతాయి.

డీహైడ్రేషన్‌..

ఈ సమస్య తలెత్తినప్పుడు శరీరంలో అలసటగా అనిపిస్తుంది.ఆ విషయాన్నీ గ్రహించలేక చాలామంది మన శరీరం ఆకలిగా ఉందని అపోహ పడుతుంటారు.దానితో వారు ఏది పడితే అది అధికంగా తినడంతో కూడా ఎక్కువగా బరువు పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తూన్నారు.కావున శరీరంలో తగినంత నీటిశాతం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

అధిక ఒత్తిడి..

స్త్రీలు చాలా రకరకాల విషయంలో అధిక ఒత్తిడి కి గురవుతూ ఉంటారు. ఈ సమయంలో కూడా వారికి ఎక్కువగా తినాలని కోరిక ఉంటుంది.కనుక ఎక్కువగా తిని,లావు అవుతుంటారు.కావున వీరు అధిక వదులు జయించడానికి కొన్ని రకాల మెడిసిన్లు తీసుకొని ఉపశమనం పొందాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

డిప్రెషన్..

చాలామంది వారి సమస్యల గురించి ఆలోచిస్తూ డిప్రెషన్ లోకి వెళుతూ వుంటారు. అలాంటి సమయంలోకూడా శరీరం అధిక బరువు పెరుగుతుందట.

హైపో థైరాయిడ్‌..

థైరాయిడ్ గ్రంథి తగినన్ని హార్మోన్లను విడుదల చేయకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారట. స్త్రీలు మెనోపాజ్‌ దశకు చేరినా బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.కావున స్త్రీలు ఈ విషయాలపై అవగాహన పెంచుకొని,వారి లావును తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: