
కీర దోసకాయ జ్యూస్ తాగడం వల్ల బహు ప్రయోజనాలు కలవు.. ముఖ్యంగా జ్యూస్ ఎలా తయారు చేయాలనే విషయానికి వస్తే.. కీరదోసకాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి కాస్త నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం రసం రెండు స్పూన్లు అలోవెరా జ్యూస్ కాస్త నీటిని పోసి మిక్సీలో వేయాలి. అన్నిటిని మిక్సీ పట్టిన తర్వాత వడగట్టితే జ్యూస్ తయారవుతుంది.. అయితే ఈ జ్యూస్ని రోజు తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కీర దోస జ్యూస్ ని తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొవ్వు పదార్థాలు కూడా బయటకి వెలుపడతాయి.
అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. అలాగే డయాబెటిస్ కూడా అదుపులోకి వస్తుంది. ఎలాంటి అధిక బరువు కలిగి ఉన్నవారు కూడా నెమ్మదిగా తగ్గుతారు.. శరీరంలో ఉండే విష పదార్థాలు కూడా శరీరంలోని చమట ద్వారా బయటికి వెళ్లిపోతుందట.కీరదోసకాయలలో శరీరానికి కావలసిన ఎన్నో రకాల విటమిన్లతో పాటు మెగ్నీషియం, సిలికాన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఉండడం వల్ల తొందరగా మన శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. కిర జ్యూస్ తాగడం వల్ల మన శరీరానికి ఒక రక్షణ కవచనంలో పనిచేస్తుంది. ప్రతిరోజు కొన్ని కీర దోసకాయలను తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు.. వీటి వల్ల మన శరీరంలో ఉండే మలినాలను కూడా తొలగించవచ్చు.