మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే కచ్చితంగా మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్ ఖనిజాలు కూడా చాలా ముఖ్యము.. ముఖ్యంగా మెగ్నీషియం వంటివి ఉండాల్సిందే మానవుని శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన ఖనిజాలలో ఈ మెగ్నీషియం కూడా ఒకటి. ఇది కండరాలు సరిగ్గా పని చేయాలన్న మన శరీరంలోని జీవ రసాయనాలు సరిగ్గా పనిచేయాలన్న మెగ్నీషియం ఉండాల్సిందే.. మెగ్నీషియం అనేది నాడీ వ్యవస్థను సైతం అదుపులోకి ఉంచేలా చేస్తుంది. మనిషి యొక్క స్థితిని కంట్రోల్లో ఉంచే విధంగా ఈ మెగ్నీషియం చేస్తుందట.


ఒకవేళ మెగ్నీషియం లోపం మన శరీరంలో వస్తే ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా బీపీని కంట్రోల్ చేయడంలో మెగ్నీషియం చాలా కీలకపాత్ర వ్యవహరిస్తుంది.. మెగ్నీషియం లోపం వస్తే కచ్చితంగా రక్తపోటు ఏర్పడుతుంది.. అయితే మెగ్నీషియం లోపం వల్ల ముందుగానే మనకు కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.

ఒకవేళ మన శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గితే హృదయ స్పందన రేటు పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది.. గుండె సాధారణ కొట్టుకొని రేటు కంటే ఎక్కువగా కొట్టుకున్నట్లు అనిపిస్తుందట.

మెగ్నీషియం లోపం ఉంటే కంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. కంటికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు కూడా ఏర్పడితే వైద్యులను సంప్రదించాలి.

ఒకవేళ రక్తంలో మెగ్నీషియం లోపిస్తే నీరసంగా చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుందట. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో కూడా మెగ్నీషియం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.. రాత్రిపూట నిద్ర లేకపోవడం లేకపోతే విపరీతమైన నిద్ర వంటి సమస్యలు కూడా ఇందుకు కారణమే.


ఒకవేళ మన శరీరంలో మెగ్నీషియం లేకపోతే ఆకలి వేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి.


అలాగే కండరాల తిమ్మిరి సమస్య ఉన్న కూడా మెగ్నీషియం లోపం వచ్చినట్టే అని గుర్తుంచుకోవాలి. కండరాల నొప్పులకు కూడా దారితీస్తాయి.. తరచు తలనొప్పి ఎక్కువగా వేధిస్తున్న లేకపోతే మైకం వంటి సమస్యలు ఎదురైన మెగ్నీషియం లోపం గాని గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: