ప్రతి రోజూ ఓ యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు.. ఈ మాట ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా మనం వింటూనే ఉంటాం.. వైద్యులు కూడా తరచూ ఈ విషయాన్నే చెబుతుంటారు.యాపిల్ తినమంటారు.నిజంగానే మనం యాపిల్స్ తినడం వల్ల చాలా రోగాలను దూరం చేసుకోవచ్చు.  డయాబెటిస్‌లో కూడా ఆపిల్ చాలా రకాలుగా మేలు చేస్తుంది.. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచేందుకు యాపిల్ ఖచ్చితంగా బాగా పనిచేస్తుంది.. అంటే.. షుగర్ ను ఈజీగా కంట్రోల్ చేసేందుకు యాపిల్ బాగా ఉపయోగపడుతుందని ఓ సర్వేలో కూడా తేలింది.నిజానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా పండ్లు తినాలి. తియ్యటి పండ్లు.. మామిడి, అరటి, దానిమ్మ సహజ చక్కెర ఎక్కువగా ఉండే వాటిని తినడం ప్రమాదమే.. ఈ పండ్లలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డయాబెటిస్ ఉంటే.. షుగర్ స్థాయి పెరుగుతుంది.. తినకూడని పండ్ల లిస్టులో ఆపిల్ లేదు. ప్రతి రోజూ ఒక యాపిల్‌ను క్రమం తప్పకుండా తినే మధుమేహ రోగి తన రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ ఉంచుకోవచ్చని అధ్యయనంలో తేలింది.యాపిల్స్‌ను మనం చాలా విధాలుగా తినవచ్చు.


వీటిని ఉడికించి తినవచ్చు. ఆపిల్ పై కూడా తయారు చేయవచ్చు. అలాగే దీన్ని పుల్లటి పెరుగులో యాపిల్ ముక్కలను కలిపి తినొచ్చు.. అలాగే బట్టర్ తో కూడిన ఆపిల్‌ను మధ్యాహ్నం స్నాక్‌గా తినవచ్చు. ఇది కొలెస్ట్రాల్ సమస్యలను ఈజీగా పరిష్కరించగలదు. ఇంకా యాపిల్ జ్యూస్ తయారు చేసుకుని తాగవచ్చు. సమ్మర్ సీజన్ లో ఆపిల్ జ్యూస్ తయారు చేసి అందులో నిమ్మరసం కలపి తాగితే.. మంచి రిఫ్రెష్ అనుభూతి వస్తుంది.ఈ యాపిల్స్ తక్కువ గ్లైసెలిక్ కలిగి ఉంటాయి. అందువల్ల యాపిల్స్ తినడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అదనంగా, ఆపిల్లో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. పండులో కొవ్వు ఉండదు. కాబట్టి యాపిల్ ఫ్యాట్ కట్టర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆపిల్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లు రాత్రి భోజనం తర్వాత తీపి తినాలనుకుంటే యాపిల్స్ తినవచ్చు. దీంతో అనేక రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: