ప్రపంచంలో చాలామంది ఎక్కువగా అధిక కొలెస్ట్రాల్ సమస్యని ఎదుర్కొంటున్నారు.. ఇది మన శరీరంలో సహజంగానే ఉత్పత్తి అవుతుంది.. ఇది చాలా ప్రాణాంతక మైన గుండెపోటు ప్రమాదాన్ని సైతం పెంచేలా చేస్తుంది..ప్రస్తుతం చాలామంది ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయట. ఒక వ్యక్తి శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అది ఆ వ్యక్తిలోని కొన్ని ఆరోగ్య సమస్యలను సైతం సృష్టిస్తుందట. వాటి యొక్క లక్షణాలను గుర్తిస్తే మనం వీటి నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా శరీరంలోని కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. చూపించే లక్షణాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


చర్మం పైన పసుపు మచ్చలు కనురెప్పల చుట్టూ ఉప్పుగా ఉంటే అవి కచ్చితంగా కొలెస్ట్రాల్ యొక్క హెచ్చరికనికి సంకేతాలట. ఇవి గుండె జబ్బులకు ప్రమాదాన్ని సూచిస్తాయట. అందుకే మీ ఫేసులో కళ్ళల్లో ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.



రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు చర్మం కూడా పసుపు రంగులోకి మారుతుందట.. ఇది ఎక్కువగా ముఖం మీద కనిపిస్తుంది.. మీ ముఖంతో పాటు చర్మం కూడా పసుపు రంగులో కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాలకు హెచ్చరిక అని గుర్తించాలి.



మరి కొంతమందికి శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే చర్మం పైన కాస్త కనతలుగా ఏర్పడతాయి. ఇవి మొటిమలలా పసుపు రంగులో కనిపిస్తూ ఉంటాయట..ఈ రకమైన మొటిమలు చాలా బాధను కూడా కలిగిస్తాయని ఇవి అధిక కొలెస్ట్రాల్ కలిగించేలా చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.



కంటి లోపల కనుపాప చుట్టూ బేసి రంగు.. లేదా తెలుపు లేదా బూడిద రంగులు ఉంటే అది అధిక కొలెస్ట్రాలకు సంకేతమట.. అందుకే కనుపాపలో మార్పులను సైతం గమనిస్తే వెంటనే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని వద్దకు వెళ్లాలి..


అంతేకాకుండా మన శరీరంలో అధిక కొవ్వు ఉంటే కచ్చితంగా అధిక బరువు పెరగడంతో పాటు కాస్త పనిచేసిన కూడా ఎక్కువ బరువుగా అనిపిస్తుందని నిపుణుల సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: