ఈ రోజుల్లో చాలా మంది కూడా ఏసీ గదుల్లో ఉంటూ కాలికి నేలంటకుండా జీవిస్తున్నారు. కానీ ఇది చాలా అనారోగ్యం. ఖచ్చితంగా రోజుకి ఒక్కసారి అయిన ఖాళీ పాదాలతో నడవాలి. నేల తగిలితే కాలి కింద భూమికి ఉన్న రకరకాల స్వభావాలు అంటుతూ ఉంటాయి. అందువల్ల ప్రకృతితో ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఖాళీ పాదాలతో నడవడం వల్ల వినమ్ర భావన కలుగుతుంది. ఖాళీ పాదాలతో నడవడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ఖాళీ పాదాలతో నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. ఈ నడక వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.పాదంపై ఒత్తిడి పడటం వల్ల రక్తప్రసరణలో చురుకు వచ్చి గుండెకు చాలా మేలు జరుగుతుంది. ఇంకా అంతేకాదుపాదాలపై ఉండే మృతకణాలు వదిలిపోయి చర్మం మెరుగవుతుంది.ఖాళీ పాదాలతో నడవడం వల్ల పాదాలు, కాళ్లు, మడమలు అనుసంధానంలోకి వస్తాయి. చెప్పులు లేదా షూస్‌ వేసుకుని నడిచేటప్పుడు తెలియకనే నడకపోశ్చర్‌ మారుతుంది. కాని ఖాళీపాదాలతో నడిచేటప్పుడు నడకకు వీలుగా శరీరం సరైనపోశ్చర్‌కు వస్తుంది. అంతేకాదు కాలి కండరాలు బలపడతాయి.


శరీరాన్ని సరిగ్గా బేలెన్స్‌ చేస్తూ నడవడం తెలుస్తుంది. కాళ్లను పూర్తిగా ఆన్చి నడవడం వల్ల నడకలో కుదురనేది వస్తుంది.అలాగే ఖాళీ పాదాలతో నడవడం వల్లపాదాలలో ఉండే నరాలు క్రమబద్ధంగా తాకిడికి లోనవుతాయి. దాని వల్ల ఒత్తిడి దూరమయ్యి సేదదీరిన భావన మీకు కలుగుతుంది.ఇంకా ఖాళీ పాదాలతో నడవడం వల్ల భూమిలోని నెగెటివ్‌ అయాన్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. మనం నిత్యం వాడే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ వల్ల శరీరంలో పేరుకున్న అయాన్లను ఇవి బేలెన్స్‌ చేస్తాయి. దాని వల్ల శరీరంలోని విద్యుదయస్కాంత స్థితి సమతుల్యం అవుతుంది. దీంతో వాపులు తగ్గడం, నిద్ర బాగా పట్టడం వీలవుతుంది.ఖాళీ పాదాలతో నడిచే వారు కూసు రాళ్లు లేదా ముళ్లు లేని మట్టి బాటల్లోగాని, గడ్డి మైదానంలోగాని, ఇసుక దారుల్లోగాని నడవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అక్కడ నడవడం వల్ల పాదాలకి మసాజ్ లాగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: