ఈ మధ్యకాలంలో గుండెజబ్బులు కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. మరి ముఖ్యంగా వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నాయి అన్న విషయం తెలియకుండానే చాలామంది మరణిస్తున్నారు . అంతేకాదు చాలా చిన్న వయసు దాదాపు 25 - 30 - 35 ఏజ్ వాళ్లు కూడా హార్ట్ ఎటాక్ కారణంగా మరణిస్తున్నారు . కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల కారణంగా ఇలా సడన్గా హార్ట్ ఎటాక్ వస్తూ ఉంది అంటుంటే మరి కొంతమంది వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు అని వాళ్ళు టెస్టులు చేయించుకుంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్న విషయం క్లారిటీగా అర్థమవుతుంది అని .. తద్వారా మెడిఖేషన్ ద్వారా కూడా వాళ్లకు ఉన్న గుండె జబ్బులను నయం చేయవచ్చు అని అంటున్నారు .

అయితే ఇలాంటి మూమెంట్ లోనే మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్ గుండెకు సంబంధించిన జబ్బులను డయాగ్నోసిస్ చేయడానికి 14 ఏళ్ల బాలుడు సిద్ధార్ధ్  కొత్త ఫోన్ యాప్ ను తయారు చేశాడు.  గుండె జబ్బులను డయాగ్నెన్సీస్ చేయాలి అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని అనేది అందరికీ తెలుసు.  అయితే చాలా తక్కువ ఖర్చుతోనే 14 ఏళ్ల బాలుడు గుండెజబ్బులను కేవలం ఏడు సెకండ్లలోనే పసిగట్టే స్మార్ట్ ఫోన్ యాప్ తయారు చేశాడు .

టెక్సాస్ లోని ఫ్రిస్కోకు చెందిన 14 ఏళ్ల సిద్ధార్ధ్ నంద్యాల అనే బాలుడు కేవలం 7 అంటే 7 సెకండ్లలోనే గుండెజబ్బును గుర్తించగల స్మార్ట్ యా ను ఆవిష్కరించి వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. నంద్యాల సిరాక్డియన్ అనే యాప్ గుండెజబ్బుల ప్రారంభ లక్షణాలను కచ్చితంగా గుర్తిస్తుంది. ఈ ఏఐ ఆధారిత యాప్ స్మార్ట్ ఫోన్ గుండె దగ్గరగా వచ్చినప్పుడు దాని మైక్రోఫోన్ ఉపయోగించి  మరి గుండె శబ్దాలను రికార్డ్ చేసి అదే విధంగా ఆ రికార్డులను క్లౌడ్ ఆధారిత మిషన్ లెర్నింగ్ మోడల్ విశ్లేషించి కేవలం 7 సెకండ్లలోనే ఆ గుండె జబ్బులను కనిపెడుతుంది .  

అసాధారణ హృదయ స్పందనను కరోనరి ఆర్టనరీ డిసీజెస్ గుండె కి సంబంధించిన సమస్యలను ఇట్టే గుర్తిస్తుంది ఈ యాప్.  ప్రారంభ దశలోనే గుండె జబ్బులను గుర్తించడం ద్వారా మరణాలను తగ్గించడం చాలా సులభతరం అవుతుంది అంటున్నారు డాక్టర్లు . ఆరోగ్య సంరక్షణకు సులభంగా అందుబాటులో ఉండే సాధనన్ని  అందించడం లక్ష్యంగా తయారు చేసినట్లు సిద్ధార్ధ్ స్వయంగా ప్రకటించారు.  ఈ యాప్ సుమారు 96% ఎక్కువ ఖచ్చితత్వంతో గుండెచప్పుడు గుర్తిస్తుంది. అంతేకాదు యాప్ ను యునైటెడ్ స్టేట్స్ లో  సుమారు 15000 మంది రోగులు పై.. భారత్ లో 3500 మంది రోగులపైగా పరీక్షించగా అందరి విషయంలోను సక్సెస్ అయ్యింది. అంతేకాదు భవిష్యత్తులో సిద్ధార్ధ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులైన నిమ్మోనియా ..పల్మనరీ ఎంబోజిలిజన్ ను కూడా గుర్తించేలా సామర్థ్యాలను విస్తరిస్తానంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: