ఫుల్ డైట్ – బాడీకి బాంబ్:
చాలామంది తినకపోతే ఫ్యాట్ తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ నిజానికి, మన శరీరం ఫ్యాట్ మాత్రమే కాదు — ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ సమతుల్యంగా కావాలి. తిండి మానేసినప్పుడు శరీరం సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. మెటబాలిజం తగ్గిపోతుంది, అంటే ఫ్యాట్ బర్న్ కాకుండా సేవ్ చేసుకుంటుంది. ఫలితంగా బరువు తగ్గడం కాదు, బాడీ సిస్టమ్స్ బలహీనమవుతాయి. హార్మోన్ లెవెల్స్ అసంతులనం చెంది, బీపీ, థైరాయిడ్, షుగర్ వంటి సమస్యలు పెరుగుతాయి. దీని వలన గుండెకు సరిపడే శక్తి, పోషకాలు అందకపోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా పెరుగుతుంది.
అతిగా వర్కౌట్స్ – శరీరానికి షాక్:
జిమ్‌లో చెమటలు కార్చడం మంచి విషయం, కానీ హద్దులు మించి చేయడం ప్రమాదకరం. ఓవర్ ఎక్సర్షన్ వల్ల హార్ట్‌పై భారీ ఒత్తిడి పడుతుంది. రక్తపోటు ఒక్కసారిగా పెరిగి గుండెకు నష్టం కలిగించొచ్చు. ప్రొటీన్లు, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. డాక్టర్ల మాటలో చెప్పాలంటే, “ఎక్సర్సైజ్ ఈజ్ మెడిసిన్, బట్ ఓవర్‌డోస్ ఈజ్ పాయిజన్.”
గుండెపోటు ఎందుకు వస్తుంది?
తిండిని తగ్గించడం వల్ల గుండెకు అవసరమైన గ్లూకోజ్, పొటాషియం, సోడియం లాంటి పదార్థాలు తగ్గిపోతాయి. దీంతో హార్ట్ మసిల్స్ సరిగా పని చేయలేవు. అలాగే, అతిగా వ్యాయామం చేయడం వల్ల హార్ట్ బీట్ అనియంత్రితంగా మారుతుంది, బీపీ పెరుగుతుంది, రక్తనాళాలు కుంచించుకుంటాయి, ఇవి కలిపి హార్ట్ అటాక్‌కు దారి తీస్తాయి.
జాగ్రత్తలు – ఫిట్‌గా ఉండటమే గమ్యం, సన్నగా కాదు:
సమతుల్య ఆహారం తినాలి. తిండిలో కార్బ్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అన్నీ ఉండాలి. డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ గైడ్‌లైన్‌లో మాత్రమే డైట్ చేయాలి. వర్కౌట్ చేయడం అవసరం – కానీ మీ బాడీ లిమిట్‌లో. స్లీప్, వాటర్, స్ట్రెస్ కంట్రోల్ కూడా ఫిట్‌నెస్‌లో భాగం. అంతేకాదు ఎక్కువుగా స్ట్రెస్ కి లోనైన హార్ట్ అటాక్స్ రావచ్చు అంటున్నారు డాక్టర్లు. “ఫిట్‌గా ఉండడం” అంటే బలంగా, ఆరోగ్యంగా ఉండడం — అల్లుకుపోయిన కండరాలు కాదు, సరిగా పనిచేసే హార్ట్ కావాలి.
ఫుల్ డైట్‌లు, అతి వర్కౌట్స్ మన శరీరానికి శిక్షలు. స్వయంగా వైద్యుల సలహా లేకుండా అలాంటి ఎక్స్‌ట్రీమ్ మార్గాలు అనుసరించడం అంటే గుండెపోటుకు ఆహ్వానం ఇచ్చినట్టే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి