మే 26వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు  ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం రండి. 

 

 ప్రధాని నరేంద్ర మోదీ : 2014 మే 26వ తేదీన భారత 15వ  ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకరం చేశారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పాలనా వ్యవస్థ పూర్తిగా మారిపోయింది అన్న  విషయం తెలిసిందే. ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు... ఊహకందని నిర్ణయాలు... ఇలా నరేంద్ర మోడీ పాలన ఎంతో విజయవంతంగా దూసుకుపోయింది. దేశ ప్రజలందరికీ నరేంద్రమోడీ ఎంతగానో ప్రభావితం చేశారు అని చెప్పాలి. దేశ ప్రజలందరూ మెచ్చేలా పాలన కొనసాగించిన  నరేంద్ర మోడీ రెండవసారి కూడా... ఘన విజయం సాధించి ప్రధానిగా ప్రమాణ స్వీకరం చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఉన్న విషయం తెలిసిందే. 

 


 ఇస్మాయిల్ జననం  : ప్రముఖ కవి అధ్యాపకుడు ఆయన ఇస్మాయిల్  1928 మే 26వ తేదీన జన్మించారు. ఎన్నో రకాలైన రచనలు రచించి ఎంతగానో ప్రేక్షక ఆదరణ పొందారు. ఇక ఈయన రచనకు గాను ఈయనను చెట్టు కవిగా పిలుచుకునేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందిన ఇస్మాయిల్... ఎస్ఆర్ఆర్ అండ్ సి.వి.ఆర్ కాలేజీలో ప్రిన్సిపల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ తర్వాత భాషా సంఘంలో సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు ఇస్మాయిల్. ఆయన 2003 నవంబర్ 25వ తేదీన మరణించారు

 


 గణపతి సచ్చిదానంద స్వామి జననం  : ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు అవధూత,  దత్త పీఠం వ్యవస్థాపకులు నిర్వాహకులు అయినా గణపతి సచ్చిదానంద స్వామి 1942 మే 26వ తేదీన జన్మించారు. మైసూర్లోని అవధూత దత్తపీఠం వీరి ప్రధాన కేంద్రం. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక పీఠాలు కూడా ఉన్నాయి. ధర్మము భక్తి భజన కీర్తన లాంటి సాంప్రదాయాలు గణపతి సచ్చిదానంద స్వామి బోధించే మార్గాలలో ప్రధానమైనవి. సంగీతం ద్వారా రోగాలను నయం చేయవచ్చు అని స్వామీజీ చెబుతూ  ఉంటారు. సంగీతం ద్వారా రోగాలను నయం చేసే చికిత్సను నాద చికిత్స అంటారు ఆయన చెబుతూ ఉంటారు. అయితే చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక సాధన పట్ల సంగీతం పట్ల విశేషమైన ఆసక్తి చూపారు గణపతి సచ్చిదానంద స్వామి. అయితే బడికి వెళ్లే  సమయంలోనే తన స్నేహితులతో కలిసి సత్సంగాలు జరిపించడం కొన్ని అద్భుత సిద్ధులు ప్రదర్శించడం చేసేవారు అని చెబుతూ ఉంటారు. అయితే ఎన్నో దేశాలలో భారీ ఆంజనేయ కుమార స్వామి విగ్రహాలను స్థాపించి హిందూ మతం అభివృద్ధికి  ఎంతగానో కృషి చేశారు గణపతి సచ్చిదానంద స్వామి. 

 


 అరుణ్ నేత్రవల్లి జననం : ఇండియన్ అమెరికన్ కంప్యూటర్ ఇంజనీర్... అయినా అరుణ్ నేత్రవల్లి 1946 మే 26వ తేదీన జన్మించారు. అయినా డిజిటల్ కుదింపు సిగ్నల్ ప్రాసెసింగ్ ఇతర రంగాల్లో ప్రారంభ పరిశోధన నిర్వహించారు. కాగా  నేత్రవల్లి తన పరిశోధనలకు గాను ఎన్నో అవార్డులు గౌరవ పట్టాలను కూడా పొందారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. 


 మనోరమ జననం : సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి ఆయన మనోరమా  దక్షిణ భారత సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. ఈమె  1937 మే 26వ తేదీన జన్మించారు. సుమారు పదిహేను వందలకు పైగా సినిమాల్లో నటించిన ఎంతగానో గుర్తింపు సంపాదించారు. అటు 1000 పైగా నాటక ప్రదర్శనలు కూడా ఇచ్చింది మనోరమ. ఎక్కువగా తమిళ భాషల్లో నటించి ఎంతో గుర్తింపు సంపాదించాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు 1985లో ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలలో నటించిన నటీమణిగా  గిన్నిస్ బుక్ లో స్థానం కూడా సంపాదించింది మనోరమ . తన సినీ ప్రస్థానంలో ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. జయలలిత, అన్నాదురై, ఎంజి రామచంద్రన్  కరుణానిధి, నందమూరి తారక రామారావు వీరితో కలిసి నటించింది మనోరమ. 

 


 మండలి బుద్ధ ప్రసాద్ జననం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన మండలి బుద్ధ ప్రసాద్ 1956 మే 26వ తేదీన జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి గా మాజీ మంత్రి గా కూడా ఈయన  పని చేశారు. తెలుగు భాషాభిమాని ఆయన మండలి బుద్ధ ప్రసాద్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు... జాతీయవాదం గాంధేయవాదం కలిగిన మనిషిగా ప్రజా నేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మండలి బుద్ధ ప్రసాద్. 

 

 రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణం : విద్యావేత్తగా సంఘసంస్కర్తగా పవిత్రతక సంకేతంగా  ఉండే రఘుపతి వేంకటరత్నం నాయుడు 1939 మే 26వ తేదీన పరమపదించారు. బ్రహ్మర్షిగా ఆంధ్రప్రదేశ్లో పేరుపొందిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. సంఘ సంస్కరణోద్యమం బ్రహ్మసమాజం ఈ పేర్లు చెబితే  గుర్తుకు వచ్చే పేర్లలో  కందుకూరి వీరేశలింగం పంతులు తోపాటు రఘుపతి వెంకటరత్నం నాయుడు పేరు  ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: