గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 13వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు...

1796 : భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు.
1919 :పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు.

ప్ర‌ముఖుల జననాలు..

1743: థామస్ జెఫర్‌సన్, [1] అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826)
1905: న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984)
1908: బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది
1939: సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013)
1914: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)  శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ప్రముఖుడు. అతను జన్మనామం ఆనందమోహనుడు. బందరులో జన్మించిన అతను అక్కడే కొంతకాలం చదువుకున్నాడు. హిందీలో నైపుణ్యం కోసం కాశీకి వెళ్ళి వచ్చాడు. తర్వాత తండ్రి కోరిక మేరకు మలయాళ స్వామి చెంతకు చేరి అక్కడే ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందాడు.  1950 లో శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాడు.

ప్ర‌ముఖుల మరణాలు..

1999: షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924)
1999: దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935)
2007: ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
2007: వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933)

మరింత సమాచారం తెలుసుకోండి: