చాల మంది పిల్లలు పాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడరు. అయితే వారికీ ఇదివరకు కాలంలో అన్నం వండేటప్పుడు గంజి తీసి పక్కన పెట్టేవారు. ఆ తర్వాత ఆ గంజి లో కొంచెం ఉప్పు, నిమ్మ రసం కలుపుకుని తాగేసేవాళ్లు. ఇలా చేయడం వలన బియ్యంలో ఉండే పోషకాలు బాగా శరీరానికి అందేవి. అందుకే గంజిని తాగే వారు. బహుస్య అందుకేనేమో మన తాతలు, ముత్తాతలు ఆరోగ్యంగా ఉండే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.