పిల్లల పెరుగుదల వచ్చే మార్పులలో తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు అనుచితంగా ప్రవర్తించినా.. చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడితే వారికి అర్థమయ్యేలా వివరించాలని వారు చెబుతున్నారు. ప్రేమతో బుజ్జగిస్తూ మాట్లాడుతుంటే పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయని, మంచి పనులు నేర్చుకుంటారని వారు పేర్కొన్నారు.