పాలు తాగడం వలన ఆరోగ్యానికి మంచిది అని అందరికి తెలిసిందే. అయితే మనం నిత్యం తీసుకునే పాలల్లో ఎంత స్వచ్ఛత ఉంది, ఎంతవరకు నాణ్యమైనవనే సందేహాలు అధికంగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పండ్లు, నూనె, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, పాలు అని పదార్థమేదైనా కల్తీకి అర్హతగా మారింది. ప్రాసెస్ చేసిన పాల ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.