పిల్లలు ఏడుస్తున్న ప్రతిసారి షాప్స్ ఎదోఒక్కటి కొనిస్తూనే ఉంటారు. ఇక పిల్లలు ఈవిధంగా వారికీ తెలియకుండానే జంక్ ఫుడ్ కి అలవాటు పడుతారు. చాలామంది పిల్లల్లో ఊబకాయానికి కారణం అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ ఫుడ్ తినడమే కారణం అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే పిల్లలు జంక్ ఫుడ్ ని వదిలి ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆకర్షితులు అయ్యేలా ప్రయత్నిస్తోంది ఓ యాప్.