నెల్లూరు : సినిమాలో నటించాలి... నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. అనుకునేవాళ్లు అతని టార్గెట్. మీరు షార్ట్ ఫిల్మ్ లో చాన్స్ ఇప్పిస్తా.. తరువాత వెండితెరపై అవకాశాలు కల్పిస్తా.. అంటూ యువతులను మోసం చేసి వారిని లోబరుచుకుంటాడు. అశ్లీల దృష్యాలను చిత్రీకరించి వాటితో విరిని భయపెట్టి వ్యభిచారంలోకి బలవంతంగా దించుతాడు. ఇంక వారితో వ్యభిచారకార్యకలాపాలు నిర్వహిస్తాడు. 

 

గత మూడేళ్లుగా యువతులను లోబరుచుకుంటూ వ్యభిచార రొంపిలోకి దింపుతున్న జాకీర్ హుస్సేన్ ను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని ముఠా గుట్టును బయటపెట్టారు. ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ తో పాటు 8 మంది నిర్వాహకులను, ఐదుగురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. వారి మోసానికి బలైన ఏడుగురు యువతులను హోంకు తరింలచారు. 


కోవూరుకు చెందిన ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ముఠా గుట్టు రట్టయింది. తాను మోసపోయానని, సినిమాల్లోఅవకాశాలు కల్పిస్తానని వ్యభిచార కూపంలోకి దించుతున్నాడని ఆ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ ఆదేశాలతో సీఐ శ్రీనివాసన్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేప్టటారు. ఆ దర్యాప్తులో జాకీర్ హుస్సేన్ గుట్టు రట్టయిందని నెల్లూరు నగర డీఎస్పీ జె. శ్రీనివాసులు ఆ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం వివరించారు. 

 

జాకీర్ హుస్సేన్ జీవనాధారంకోసం డాన్స్ నేర్పిస్తూ బ్రతికేవాడు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బుసంపాదించాలనుకున్నాడు. అందుకోసం ఓ ప్లాన్ కూడా వైసాడు. షార్ట్ ఫిలిం తీస్తానని అందులో నటించానికి యువతులు కావాలని ప్రచారం చేసాడు. దీంత  సినినమాలో నటించాలనే మోజుతో పెద్ద ఎత్తన యువతులు వచ్చారు. ఇదే అదును అనుకుని వారిని లోబరుచుకుని శృంగార చేష్టలు వీడియో తీసి వారిని భయపెట్టి డబ్బు సంపాదించాడు. అంతేకాకుండా వ్యభిచార గృహాలను ఏర్పాటు చేసి వారితో వ్యభిచారం చేయించడం ప్రారంభించాడు. 

 

అతని బారిన పడిన కొందరు మహిళలు ఏకంగా నిర్వాహకులుగా మారారు.  నిందితుడు ఇచ్చిన సమాచారంతో నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాలై పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుండి హ్యుండాయ్ కారును, ల్యాప్ టాప్ ను, మోటార్ బైక్ ను, 14 సెల్ ఫోన్లను, రూ.12,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందుతులను రిమాండ్ కు తరళించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: