ఆయనో బిలియన్ డాలర్ల కంపెనీ అధినేత.. ఆయనకు పనిలో విజయం తప్ప పరాజయం లేదు. ఆయన పట్టిందల్లా బంగారమే. కంపెనీని పలు దేశాల్లో విస్తరించాడు. అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ విజయం సాధించాడు. అంటే ఆయన జీవితంలో అంతా విజయమే.

 

అయితే ఇది జీవితానికి ఒక కోణం మాత్రమే.. ఆయనకు జీవితంలో విజయాలు సాధారణంగా మారినా.. ఓ కీలకమైన విషయంలో పరాజితుడుగా మిగిలాడు. అయితే ఆ విషయం ఆయన మనసుకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఆయన్ను చూసి పరులంతా.. ఆహా.. జీవితం అంటే ఆయనదేరా అనుకుంటారు.

 

కానీ అసలు విషయం ఆయనకే తెలుసు. అదేంటంటే.. ఆయనకు విజయమే తెలుసు. కానీ సంతోషం తెలియదు. అదేంటి విజయం సంతోషాన్ని ఇవ్వదా అని ప్రశ్నించకండి. విజయం అన్నిసార్లు మనసుకు సంతోషం ఇవ్వదు. ఆయనకు పని మాత్రమే తెలుసు. సంతోషం తెలియదు.

 

విజయానికి, సంతోషానికీ తేడా తెలుసుకోగలగడమే అసలైన జీవిత రహస్యం. అది మాత్రం ఆయన తెలుసుకోలేకపోయాడు. అందుకే అన్ని కోట్ల డాలర్లు సంపాదించినా ఇంకా జీవితంలో అసంతృప్తే. ఈ విషయంలో మీ సంగతేంటో మీరూ ప్రశ్నించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: