ఈ జీవితానికి అర్థం ఏంటి.. అసలు మన పుట్టుక పరమార్ధం ఏంటి.. ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఓసారి వస్తూనే ఉంటాయి. కానీ అదేంటో ఆలోచించేలోగానే ఇల్లు, సంసారం, పిల్లలు వంటి ఐహిక వాస్తవాలు మనల్ని ఆ దిశగా ఆలోచించనివ్వవు. కానీ అసలు మనం ఆలోచించాల్సిన అసలై విషయం అదే.

 

 

ఎందుకంటే మన చివరి ప్రస్తానం అదే. అందుకని మొత్తం ఐహిక విషయాలు పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడో వృద్ధాప్యంలో ఆలోచించుకోవచ్చులే అని..

ఆత్మజ్ఞానం గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదని ఊరుకోకూడదు.

అందుకే మన జీవితం తామరాకుపైన నీటిబొట్టులా భౌతిక జీవితంలో మెరవాలి.

 

 

కాళ్లు తడవకుండా సముద్రం దాటగలమా.. కానీ.. సంసార సాగరాన్ని అలాగే ఈదాలి. జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదుకు రావాలి. ఐహిక బంధాల్లో చిక్కుపడి.. ఆధ్యాత్మిక పథాన్ని వీడకూడదు. భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు... ఇవన్నీ ముఖ్యమే..కానీ ఇవేవీ శాశ్వతం కాదన్న స్పృహ ఉండాలి.

 

 

ఆ దిశగా నీ ప్రయాణం ఒంటరిగానే సాగాలి. ఆత్మీయులు అనుకున్నవారు, ఆత్మబంధువులన్నవారు ఊరి పొలిమేర దాకా కలిసి వస్తారేతప్ప, చివరి ప్రయాణంలో మనిషి ఏకాకి మాత్రమే. అందుకే మనోబలంతో ముందుకు సాగాలి. మనసును వశం చేసుకున్న సాధకులు మాత్రమే ఒంటరిగా జీవన యాత్రను జైత్రయాత్రగా మలచుకుంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: