
కావలసిన పదార్థాలు :
రాగి పిండి: రెండు కప్పులు,
అంజీర్: ఒక కప్పు,
తరిగిన బాదం: అరకప్పు,
నెయ్యి: ఒక కప్పు,
తరిగిన వాల్ నట్స్: పావు కప్పు,
గసగసాలు: రెండు టీ స్పూన్లు,
ఎండిన ఖర్జూరం: అరకప్పు
తయారీ విధానం:
ముందుగా ఖర్జూరాలు, అంజీర్ నాలుగు గంటల పాటు నాన బెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు, కడాయిలో నెయ్యి వేడయ్యాక రాగిపిండి వేసి సన్నటి మంటపై వేయించాలి. పిండి బాగా వేగిన తర్వాత గసగసాలు, తరిగిన బాదం, వాల్‌నట్స్ వేసి బాగా కలిపి దింపేయాలి. ఇంకో కడాయిలో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక అంజీర్ ముద్ద వేసి, గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. బాగా వేగిన తర్వాత రాగిపిండి మిశ్రమాన్ని కలిపి, మరికాసేపు వేయిస్తే మెత్తటి ముద్దలా తయారవుతుంది. దాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లో పరిచి చల్లారాక ముక్కలు చేసి, కోసుకుంటే సరి. ఆరోగ్యకరమైన రాగి-అంజీర్ బర్ఫీ రెడీ... వీటిలో రుచి తో పాటుగా ఆరోగ్యం కూడా ఉండటంతో చిన్న పిల్లలు కూడా వీటిని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చెయ్యండి..