ప్ర‌స్తుతం మాన‌వుడు అంతా ఉరుకు ప‌రుగుల జీవితంలో ఉన్నాడు. ఒత్తిళ్లు తీవ్రం అవుతున్నాయి. ప‌ని గంట‌లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పురుషుల్లో రోజు రోజుకు లైంగిక సామర్థ్యం త‌గ్గుతోంది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రిగాయి. తాజాగా లండ‌న్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌న‌ల్లో మ‌రోసారి ఇదే విష‌యం స్ప‌స్ట‌మైంది. అయితే ఇందుకు అనేక కార‌ణాలు కూడా వారు వెల్ల‌డించారు. మ‌నం తినే ఫాస్ట్ ఫుడ్‌, పీల్చే గాలి, తీవ్ర‌మైన ఒత్తిడి కూడా శృంగార జీవితంపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూప‌తుంద‌ని ఈ ప‌రిశోధ‌న‌లు చెప్పాయి.

అందుకే శృంగారం చేయ‌డం ప్రారంభించిన వెంట‌నే అంగ‌స్తంభ‌న స‌మ‌స్య‌తో పురుషులు డీలా ప‌డిపోతున్నారు. దీంతో అటు జీవిత భాగ‌స్వామి కూడా సంతృప్తి చెంద‌డం లేదు. ఇది అంతిమంగా వారి జీవిత బంధంపై కూడా తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. దీనికి తోడు చెడు అల‌వాట్లు, ధీర్ఘ‌కాలిక వ్యాధులు కూడా శృంగార జీవితంపై అనాస‌క్తికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని తాజా అధ్య‌య‌నం చెప్పింది. ఇక పురుషుల్లో వ‌య‌స్సు పెరుగుతోన్న కొద్ది శృంగారంలో కీల‌క పాత్ర పోషించే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి క్రమ క్రమంగా తగ్గుతుంది.

ఇక మ‌ద్యపానంతో పాటు ధూమ‌పానం చేసే వారిలో ర‌క్త‌నాళాల ప‌రిమాణం త‌గ్గ‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగా జ‌ర‌గ‌దు. ఇది కూడా అంగం స్తంభించేందుకు కార‌ణ‌మ‌వుతుంది. ఇక గుండె సంబంధిత వ్యాధులు... మ‌నుషులు ఊబ‌కాయులు అవ్వ‌డం. డ‌యాబెటిస్ ఫేషెంట్లు, శ‌రీరంలో కొవ్వు పేరుకు పోవ‌డం, హై బీపీ ఇవ‌న్నీ కూడా శృంగార సామ‌ర్థ్యాన్ని త‌గ్గించేస్తాయ‌ట‌. ఇక క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నా అంగం సరిగా స్తంభించద‌ట‌.  అయితే పై కార‌ణాలు మాత్ర‌మే కాదు... పురుషుల‌కు శృంగారంపై ఆస‌క్తి త‌గ్గ‌డానికి మ‌హిళ‌ల శ‌రీరంలో వ‌చ్చే మార్పులు కూడా ఓ కార‌ణ‌మ‌ని చెపుతారు.

పిల్ల‌లు పుట్టాక‌.. ఆ త‌ర్వాత వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది వారి శ‌రీర ప‌రిమాణంలో మార్పులు వ‌స్తాయి. దీంతో పురుషులు కొంద‌రు స్త్రీల విష‌యంలో విముఖ‌త చూపుతారు. ఇవ‌న్నీ కూడా శృంగారం ప‌ట్ల అస‌క్తిని ప్ర‌భావితం చేస్తాయ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: