చలికాలం రానే వచ్చేసింది.. ఈ వాతావరణం నుండి శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ వెచ్చని దుస్తులు వేసుకోవడం , చేతులకు , కాళ్లకు గ్లౌజులు, సాక్స్ లు లాంటివి తొడుక్కోవడం వంటివి చేస్తూ ఉంటారు. చలికాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. పైగా కరోనా మహమ్మారి కూడా మనల్ని వెంటాడుతుంది.. కాబట్టి దీని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇక ఈ చలి కాలంలో మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. లేకపోతే కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చలికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు  మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహార పద్ధతులను మనం వాతావరణాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ కాలంలో ఎక్కువగా కాస్త గోరు వెచ్చగా ఉండే  డ్రింక్స్ లాంటివి మనం తీసుకుంటూ ఉండాలి. చల్లగా ఉండే డ్రింక్ తో పాటు కొద్దిగా మన శరీరానికి మేలుచేసే ఆహార పదార్థాలను కూడా కలిపి తీసుకుంటే ఇప్పుడు వచ్చే సమస్యల నుండి బయటపడవచ్చు. ఇప్పుడు ఒక హెల్దీ డ్రింక్ రెసిపీ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

అయితే ఇప్పుడు ఆ రెసిపీ నీ ఎలా తయారు చేసుకోవాలి .. దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఇందుకోసం గుప్పెడు జీడిపప్పు.. అర టేబుల్ స్పూన్ వినీల ఎక్స్ట్రాక్ట్.. టేబుల్ స్పూన్ దాల్చిన పొడి.. రెండు కప్పుల కొబ్బరి పాలు.. బెల్లం పొడి..

ఇక మీరు ఈ రిసిపిని తయారు చేయడానికి ముందుగా జీడిపప్పు ను గోరువెచ్చని నీళ్ళలో పది నిమిషాల పాటు నాన బెట్టాలి. తర్వాత మిక్సీ జార్ లో వెనిల్లా ఎక్స్ట్రాక్ట్, జీడిపప్పు పొడి వేసి అలాగే కొబ్బరి పాలు కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇక బెల్లం పొడి వేయడం మంచి రుచి కూడా దొరుకుతుంది. ఇక దీనిని మీరు చలికాలంలో ఉన్నప్పుడు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: