సాధారణంగా బొప్పాయి పండు ఎన్నోరకాల పోషకాలను ఇమిడి ఉంటుంది. మీకు అందులో భాగంగానే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ , విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగానే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాల కూడా అందిస్తుంది. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి బొప్పాయితో కలిపి తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

బొప్పాయి , ఆరెంజ్ పండ్లను కలిపి ఒకేసారి తినకూడదట. ఇక ఈ రెండు పండ్లను వెంట వెంటనే తీసుకుంటే గ్యాస్ , అసిడిటీ ,కడుపు నొప్పి వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పొరపాటున కూడా మీరు బొప్పాయి , ఆరెంజ్ కలిపి తినకూడదు.

ముఖ్యంగా బొప్పాయి , పెరుగు కూడా అసలు తినకూడదు.వీటిని వెంట వెంటనే కలిపి తినడం వల్ల మన ఆరోగ్యం పై చెడు ప్రభావం ఏర్పడుతుంది. కనీసం రెండు గంటల సమయం అయినా గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి.

బొప్పాయి, టమోటా కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. బొప్పాయి పండును తిన్న వెంటనే మీరు టమోటా వంటకాలను తీసుకుంటే తలనొప్పి, మైకం, చికాకు , వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి కూడా దూరంగా ఉండాల్సిందే.

ఇక అలాగే బొప్పాయి, నిమ్మ పండు కూడా అసలు తినకూడదు. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత హానికరం కలుగుతుంది. ఇకపోతే బొప్పాయితోపాటు లెమన్ కూడా కలిపి తీసుకోవడం వల్ల హిమోగ్లోబెన్స్ స్థాయి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రక్తహీనత సమస్య ఏర్పడి ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


ఇక బొప్పాయి,  కివి రెండు పండ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. కానీ ఈ రెండింటిని కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: