ప్రస్తుతం మనం తీసుకొనే ఆహారం వలన మన కడుపులో అనేక మార్పులు జరుగుతున్నాయి.అజీర్తి, ఎసిడిటి,మనం తీసుకునే ఆహారాలు, స్పైసీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వలన కడుపు నొప్పి బారిన పడుతున్నారు.సరైన సమయానికి భోజనం చేయకపోవడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, కాలుష్యం మరియు ఇతర కారణాల వలన కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కడుపు నొప్పికి కారణం ఏదైనా.. వెంటనే తగ్గించుకోవడం ఉత్తమం. ఇప్పుడు మనం కడుపునొప్పి వచ్చినప్పుడు ఎలాంటి నాచురల్ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

కడుపునొప్పి వచ్చినప్పుడు పుదీనా ఆకులు అద్భుతంగా ఉపయోగపడుతాయి.ఒక పాత్ర లో నీటినీ తీసుకొని..అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి గోరవెచ్చగా అయ్యాక  ఆ నీరు త్రాగడం వలన ఉపశమనం కలుగుతుంది.

వాముని  బాగా నమిలి వాటి నుంచి వచ్చే రసాన్ని మింగడం వలన కానీ కడుపు నొప్పి తగ్గుతుంది.

కడుపు నొప్పిని నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా చాలా సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరవెచ్చని నీటిలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి సేవించాలి.ఇలా చేస్తే ఎంత తీవ్రమైన కడుపునొప్పి అయినా సులువుగా తగ్గుతుంది.

కడుపు నొప్పి వచ్చినప్పుడు అర కప్పు పెరుగు తీసుకోవడం వలన  వెంటనే కడుపు నొప్పి తగ్గుతుంది. పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉండడం వలన ఇది కడుపు నొప్పికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఒక స్పూన్ జీలకర్రను నీళ్లలో వేసి బాగా మరిగించి చల్లార్చిన తరువాత ఆ గోరవెచ్చని నీరుని తీసుకోవడం వలన కొంచెం ఉపశమనం కలుగుతుంది.

అల్లంని నీటిలో వేసి బాగా మరిగించాలి. అల్లంలో ఆంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల అల్లం వేసి మరిగించిన నీరులో కొంచెం తేనె కలిపి తీసుకోవడం వలన తక్షణం ఉపశమనం కలుగిస్తుంది.

ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వెంటనే కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: