మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతో పాటు మనకు అనారోగ్య సమస్యలను తెచ్చే కూరగాయలు కూడా చాలా ఉంటాయి. ఇలా అనారోగ్యాన్ని తెచ్చే కూరగాయలు మనలో చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే కూరగాయలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి హానిని కలిగించే కూరగాయల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక మనం ఆహారంగా తీసుకునే వాటిలో క్యాప్సికం కూడా ఒకటి. వీటిని చాలా రకాల వంటకాల్లో వాడుతూ ఉంటాము. క్యాప్సికం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయినా కానీ దీనిని తీసుకోవడం వల్ల కడుపులో మంటతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో బ్రకోలి కూడా ఒకటి. అయితే దీనిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా అలాగే థైరాయిడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. అలాగే మనలో చాలా మంది కూడా బ్రస్సెల్ స్ప్రౌట్స్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి చూడడానికి చిన్న క్యాబేజిలాగా ఉంటాయి. అయితే ఇవి అంత సులభంగా జీర్ణం అవ్వవు.


అందువల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంకా అలాగే మనలో కొందరు నిల్వ ఉండే క్యాన్డ్ వెజిటేబుల్స్ ను తీసుకుంటూ ఉంటారు.వీటిని తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. అలాగే సెలరీని కూడా మనలో చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇందులో ఇతర కూరగాయల కంటే పోషకాలు తక్కువగా ఉండడంతో పాటు దీనిలో క్రిమి సంహారక మందుల  అవశేషాలు 68 రకాలుగా పైగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు జరిపిన పిశోధనల్లో వెల్లడైంది.ఇంకా అలాగే మొక్కజొన్నను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఇక మొక్కజొన్న చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కానీ మొక్కజొన్నను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడంతో పాటు ఇంకా బరువు కూడా పెరుగుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: