మైగ్రేన్ అనేది చాలా ప్రమాదం. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇక మైగ్రేన్ అంటే చాలా మంది తల నొప్పే అనుకుంటారు. అయితే మైగ్రేన్ అంటే తలలో ఒక వైపు వచ్చే తల నొప్పి.మైగ్రేన్ వల్ల కొంత మందిలో వికారం, వాంతులు, శబ్దాల్ని తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ఒత్తిడి వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది ఎటాక్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా ఒక వైపు తల నొప్పితో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక పులియ బెట్టిన పచ్చళ్లు, ఫ్రూట్ జ్యూస్ లలో థైరమైన్ అనేది ఉంటుంది. ఇక దీని వల్ల మైగ్రేన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు వీలైనంత వరకూ పులియ బెట్టిన ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. నిల్వ పచ్చళ్లు అస్సలు తినకూడదు.అలాగే ఆల్కహాల్ లో ఇథనాల్ అనే పదార్థం ఉంటుంది. ఇక దీని వల్ల కూడా మైగ్రేన్ రావచ్చు.


ఇథనాల్ బాడీలోకి వెళ్లగానే అది ఓ రసాయనంగా మారుతుంది. దీని వల్ల మైగ్రేన్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక వైపు తల నొప్పితో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.ఇంకా చల్లగా ఉండే పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఐస్ మైగ్రేన్ తో ఉన్న వారు తాగడం వల్ల ఈ సమస్య ఇంకా తీవ్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల మైగ్రేన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి మైగ్రేన్ తో భాధ పడేవారు వీలైనంత వరకు ఆహారం విషయంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలి.ఇంకా అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్ లో బీటా ఫెనిలేథైలమైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కూడా మైగ్రేన్ సమస్యను తీవ్ర తరం చేస్తుంది. కాబట్టి టీ, కాఫీలు, చాక్లెట్లు, ఇంకా కెఫీన్ ఉన్న వాటిని చాలా దూరంగా ఉంచండి.ఖచ్చితంగా పైన చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. ఈ సమస్యని ఈజీగా తొలగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: