ప్రతివారు తమ జుట్టు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆడవారి జుట్టు అందంగా ఉంటేనే బాగుంటుంది. జుట్టు అందంగా ఉంటేనే బాడీ కూడా అందంగా కనిపిస్తుంది. జుట్టు బాగా ఎదగాలి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలని తీసుకోవడం మంచిది. బొచ్చ గింజల పప్పు తినడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. కుంకుడుకాయ కంటే శేకాకాయి జుట్టుకి చాలా మంచిది. శేకాకాయి జుట్టును ఆరోగ్యం గా ఉంచడానికి సహాయపడుతుంది. కలబంద జుట్టుకి రాయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది.

జుట్టు రాలటం, చుండ్రు సమస్య తగ్గడానికి వారానికి రెండుసార్లు వేపాకు నీటిలో వేసి మరిగించి షాంపూతో తలస్నానం చేసి తర్వాత ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. జుట్టు వేగంగా, దట్టంగా పెరగాడానికి కలబంద జల్ని రాయండి. ఇది జుట్టుకు దురద మంట సమస్యను తగ్గిస్తుంది. తడి జుట్టుకు తేనే, కొబ్బరి నూనె కలిపి రాయండి. ఆ తర్వాత షాంపూ తో తలస్నానం చేయండి. ఇది జుట్టు మృదువుగా బలంగా చేస్తుంది.  మీ జుట్టు ఒత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. జుట్టు పొడవుగా, దట్టంగా పెరగడానికి ఉసిరికాయ రసంలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపి జుట్టుకు రాయండి.

ఇది జుట్టు వేళ్ళను బలపరుస్తుంది. తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది. బట్టదల సమస్య ఉన్నవారు పాలల్లో కొద్దిగా కుంకుమపువ్వు, అతిమధురం పొడి కలిపి జుట్టుకు రాయండి. వారానికి రెండుసార్లు వాడండి. కొంతమంది జుట్టుకు నూనె రాసి రాత్రంతా అలాగే వదిలేస్తారు. అయితే అలా చేయడం వల్ల కొన్ని నష్టాలు ఉండవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం... స్కాల్ప్ కూడా సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుందని గమనించండి. సో రాత్రిపూట తలకు నూనె రాసుకుని... అలానే వదిలేస్తే దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల ఆ ఆయిల్ బెడ్ షీట్లకు అందుకుని దుమ్ము ధూళి వచ్చి చారుతాయి. కొబ్బరి పాలల్లో మెహందీ ఆకులు కలిపి వారానికి రెండు సార్లు రాయండి. ఆ తర్వాత షాంపూ తో తలస్నానం చేయండి. ఇది జుట్టుకు సహజమైన రంగును ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: