ఈరోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా డయాబెటిస్ సమస్య ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. డయాబెటిస్ ఇది ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా నయం అయ్యే సమస్య కాదనే విషయం మనకు తెలుసు. షుగర్ మందులతో జీవనశైలి మార్పులతో దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం తప్పించి మరో మార్గం లేదు. అయితే చాలామంది షుగర్ పేషెంట్స్ అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ ను గడుపుతారు, దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉండవు. 

బ్లడ్ షుగర్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటే... దాహం పెరగడం, నోరు ముడి మారడం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, బలహీనత, అస్పష్టమైన దృష్టి, పొడి చర్మం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో లేకపోతే చూపు పోవడం, నాడులు దెబ్బ తినడం, పాదాల మీద పుండ్లు పడడం, కిడ్నీ సమస్యలు వంటి తీవ్ర దుప్ప్రుభావాలకు దారి తీస్తాయి. షుగర్ పేషంట్స్ రోజువారి కొన్ని అలవాట్లు చేసుకుంటే బ్లడ్ సుగర్స్ నిరంతరించుకోవచ్చని డాక్టర్  ఫతే సింగ్ అన్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

రోజులో 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ధ్యానం చేయడం డీప్ బ్రీతింగ్ డేక్నిక్ ఫాలో అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకునేందుకు సమతూలిత ఆహారం తీసుకోండి. తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే షుగర్ తగ్గుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. డిహైడ్రేషన్ సమస్య కూడా తగ్గుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. గ్రీన్ టీ తాగితే షుగర్ తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: