జుట్టు అంటే కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యానికి ప్రతీకగా కూడా పరిగణించబడుతుంది. అయితే ఆధునిక జీవనశైలి, పౌష్టికాహార లోపం, ఒత్తిడి, వాతావరణం, కలుషితత వంటి కారణాలతో జుట్టు బలహీనంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. జుట్టు బలంగా ఉండాలంటే బయటపరిచర్యతో పాటు లోపలి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి. జుట్టు బలంగా, ఆరోగ్యంగా మారేందుకు పాటించవలసిన చిట్కాలు.  సరిగ్గా ఆహారం తీసుకోవడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ప్రొటీన్తో ఉంటుంది.

అందువల్ల తినే ఆహారంలో ప్రోటీన్ ఉండడం తప్పనిసరి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం, పెసరపప్పు, శెనగలు, బాదం, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు. ఐరన్ లోపం వల్ల జుట్టు రాలే అవకాశాలు పెరుగుతాయి. జింక్ జుట్టు కండిషన్‌ మెరుగుపరుస్తుంది. ఐరన్-జింక్ ఉన్న ఆహారం, దాల్చిన చెక్క, వేరుశెనగలు, బీట్‌రూట్, ఆకుకూరలు, ఖర్జూరాలు. జుట్టుకి తేమ, బలాన్ని ఇస్తుంది. ఓమెగా-3 ఫుడ్స్, అఖరోట్లు వాల్‌నట్స్, ఫ్లాక్స్సీడ్స్, చేపలు, అవకాడో. జుట్టు పెరుగుదలకి, కాంతికి అవసరం. విటమిన్ C పండ్లు, ఉసిరికాయ, నిమ్మకాయ, నారింజ, దానిమ్మ. బయోటిన్ ఉన్న ఆహారం. గుడ్డు పసరు భాగం, ఉల్లిపాయలు, క్యారెట్, కీవీ. కొబ్బరినూనెలో కరివేపాకు వేసి మరిగించి వడకట్టి వాడండి.

ఇది జుట్టు వృద్ధికి, ఒత్తుగా మారటానికి సహాయపడుతుంది. నూనెను వేడి చేసి ఈ మిశ్రమాన్ని వేసి తలకు తాపిదీయండి. రక్త ప్రసరణ పెరిగి, జుట్టు బలంగా మారుతుంది. అరగంత ముద్ద, మెంతుల ముద్దను జుట్టుకి అప్లై చేసి 30 నిమిషాలు ఉంచి ఉష్ణజలంతో కడగాలి. ఇది జుట్టు రాలికీ, పొడిగా మారకుండా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. తల శుభ్రం, కండిషనింగ్ పద్ధతులు, వారం లో కనీసం 2-3 సార్లు తల కడుక్కోవాలి. చాలా వేడి నీళ్లు వాడకండి – అది జుట్టు పొడిగా మారుస్తుంది. సల్ఫేట్ లేకుండా ఉండే హెర్బల్ షాంపూలను వాడాలి. తల కడిగిన తర్వాత సహజమైన కండిషనర్ వాడండి – అరటిపండు ముద్ద లేదా పెరుగు మిశ్రమం.

మరింత సమాచారం తెలుసుకోండి: