
అలసట, నీరసం చాలా సాధారణం. సరైన నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం, ఎక్కువ పని, మానసిక ఒత్తిడి లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరగొచ్చు. నీరసంగా అనిపించినప్పుడు వెంటనే పని మీద శ్రద్ధ పెట్టలేము. ఏదైనా చిన్నపాటి చిట్కాలు పాటిస్తే మనం ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
ప్రతిరోజు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి. ఎందుకంటే శరీరం, మెదడు తిరిగి శక్తిని పొందేందుకు నిద్ర చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు కాఫీ లాంటివి తాగడం మానేయాలి. ఒకే సమయానికి పడుకొని, అదే సమయానికి లేచేలా చూసుకోండి. శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోతే నీరసం వస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్ ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు తగ్గించండి.
శరీరంలో నీటి శాతం తగ్గినా కూడా నీరసంగా అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తాగడం మంచిది. రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చిన్నపాటి నడక లేదా యోగా లాంటివి చేయడం వల్ల శరీరానికి, మనసుకు కూడా మంచిది. మానసిక ఒత్తిడి కూడా నీరసానికి ఒక కారణం. యోగా, ధ్యానం, సంగీతం వినడం, లేదా మీకు నచ్చిన పనులు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.
ఒకే పని ఎక్కువ సమయం చేయడం వల్ల కూడా అలిసిపోతారు. మధ్య మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే అలసట, నీరసం నుంచి బయటపడొచ్చు. ఒకవేళ ఇవి పాటించినా నీరసం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు