2019 ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అతిపెద్ద నియోజ‌క‌వ‌ర్గం అయిన చింత‌ల‌పూడి రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ ఐఆర్ఎస్ అధికారి వీఆర్‌. ఎలీజా 36 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. కేంద్ర స‌ర్వీసుల నుంచి వ‌చ్చి రావ‌డంతోనే ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా ఆయ‌న ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఎమ్మెల్యేగా యేడాది పూర్తి చేసుకోబోతోన్న ఎలీజా ప‌నితీరు ఎలా ఉంది ?  ప్ర‌జ‌ల‌కు ఎలా అందుబాటులో ఉంటున్నారు ?  ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు ?  ఆయ‌న బ‌లాలు ? బ‌ల‌హీన‌త‌లు ఎంటో ?  హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్‌లో చూద్దాం.

 

యేడాది కాలంలో ఎమ్మెల్యేగా ఎలీజా ఎక్కువుగా  ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నా అభివృద్ధి విష‌యంలో మాత్రం త‌న‌దైన ముద్ర ఇంకా చూపించ‌లేదు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌రిస్థితులు కూడా ఓ కార‌ణంమే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ ఉన్నా కూడా ప్ర‌జ‌ల కోసం కంటిన్యూగా తిరుగుతున్నారు... ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు ఎవ‌రు వెళ్లినా ఆయ‌న రిసీవింగ్ బాగానే ఉంద‌న్న మార్కులు ప‌డ్డాయి. అలాగే స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పందించే తీరు కూడా బాగుంద‌నే చెపుతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన చింత‌ల‌పూడితో పాటు న‌గ‌ర పంచాయ‌తీ అయిన జంగారెడ్డిగూడెంలో రెండు కార్యాల‌యాలు ఏర్పాటు చేయ‌డంతో అన్ని ప్రాంతాల‌కు అందుబాటులో ఉంటున్నారు. ఇక అభివృద్ధి ప‌రంగా  ఎన్నార్జీఈఎస్ నిధులు ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి రు. 9 కోట్లు రావడంతో ప‌నులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. 

 

స్థానిక ఎన్నిక‌లు వార్ వ‌న్‌సైడే...
నియోజ‌వ‌క‌ర్గంలో ఉన్న నాలుగు మండ‌లాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీకి అనుకూలంగా వార్ వ‌న్‌సైడే కానుంది. ఈ విష‌యంలో సందేహాలు అక్క‌ర్లేదు. ఇప్ప‌టికే జంగారెడ్డిగూడెం జ‌డ్పీటీసీ పోల్నాటీ బాబ్జీ (వైసీపీ ) ఏక‌గ్రీవ‌మ‌య్యారు. ఇక చింత‌ల‌పూడిలో టీడీపీ మ్యాండెట్ లేక‌పోవ‌డంతో వాళ్లు ఇంటిపెండెంట్‌కు మ‌ద్ద‌తు ఇచ్చుకుంటున్నారు. అక్క‌డ వైసీపీ గెలుపు లాంచ‌న‌మే. లింగ‌పాలెం మండ‌లంలో ఇప్ప‌టికే ఏడు ఎంపీటీసీలు ఏక‌గ్రీవమ‌య్యాయి. ఇక కామ‌ర‌వ‌పుకోట‌లో మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్ ఏక‌చ‌క్రాధిప‌త్యం న‌డుస్తుండ‌డంతో అక్కడ పార్టీ గెలుపులో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. 

 

జంగారెడ్డిగూడెంలో మాత్రం కాస్త ప‌రీక్ష త‌ప్ప‌దా...
గ‌త యేడాది ఎన్నిక‌ల్లో ఎలీజాకు 36 వేలు మెజార్టీ వ‌చ్చినా జంగారెడ్డిగూడెం న‌గ‌ర పంచాయ‌తీలో మాత్రం వంద‌ల్లోనే మెజార్టీ వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో 14 వార్డుల్లో టీడీపీకి ఆధిక్యం రాగా.. వైసీపీకి కేవ‌లం 6 వార్డుల్లో మెజార్టీ వ‌చ్చినా.. ఆ మెజార్టీ ఎక్కువుగా ఉండ‌డంతో వైసీపీకి చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా ఎక్కువ మెజార్టీ రాబ‌ట్టుకోగ‌లిగింది. అయితే ఇప్పుడు అక్క‌డ స్థానిక ఎన్నిక‌ల్లో మున్సిపాల్టీని ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో గెలుచుకోవ‌డం క‌ష్టం కాక‌పోయినా మ‌రీ అంత సులువు అయితే కాదు. 

 

బ‌లాలు (+) :
- వివాదాల‌కు దూరంగా ఉండ‌డం..
- అధికారులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లుపుగోలు త‌నం
- ఓ మోస్తరుగా అభివృద్ధి ప‌నులు
- ఉన్న‌త విద్యావంతుడు కావ‌డంతో ప‌రిస్థితుల‌పై స‌మ‌గ్ర అవ‌గాహ‌న‌

 

బ‌ల‌హీన‌త‌లు (-) :
- ఒక‌టి రెండు సామాజిక వ‌ర్గాల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న అప‌వాదు

 

రాజ‌కీయం ఎలా ఉందంటే...
ఇక నియోజ‌క‌వ‌ర్గంలో సాధార‌ణ ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి టీడీపీ నుంచి బ‌ల‌మైన నేత‌లు వైసీపీలోకి వ‌ల‌స రావ‌డం పార్టీకి, ఎలీజాకు బాగా కలిసొచ్చింది. ఇక ఏలూరు ఎంపీ శ్రీథ‌ర్ వ‌ర్గం, ఎలిజీ వ‌ర్గాలుగా పార్టీ ఉంద‌న్న టాక్ అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎంపీ శ్రీథ‌ర్ గ్రూపు రాజ‌కీయాల‌కు పూర్తిగా దూర‌మైనా ఆయ‌న‌కంటూ తండ్రి ద్వారా వ‌చ్చిన వ‌ర్గం ఆయ‌న వెంటే న‌డుస్తూ.. ఆయ‌న‌తోనే ప‌నులు చేయించుకుంటోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య పొరాప‌చ్చ‌లు లేక‌పోయినా బ‌య‌ట అలా ప్ర‌చారం ఉంది. ఇక కామ‌వ‌ర‌పుకోట‌, లింగ‌పాలెం మండ‌లాల్లో బ‌ల‌మైన నాయ‌కుల ఆధిప‌త్యం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: