
అలాగే నియోజకవర్గంలో ప్రతి వర్గాన్ని కలుపుకునిపోతూ, అందరువాడిగా ఉంటున్నారు. ముఖ్యంగా టీడీపీకి ఫుల్ సపోర్ట్ ఉండే కమ్మ సామాజికవర్గాన్ని తన వైపు తిప్పేసుకున్నారు. రాజానగరం, సీతానగరంలో బలంగా ఉన్న కమ్మ వర్గాన్ని ఆకర్షించి, టీడీపీని చావుదెబ్బ తీశారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తున్నారు. అభివృద్ధి పనులు కూడా బాగానే చేస్తున్నారు. ఇక కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారు.
అయితే తన కుటుంబం చేసే కొన్ని పనుల వల్ల రాజాకు కాస్త ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు. అటు రాజమండ్రి ఎంపీ భరత్‌కు, రాజాకు పెద్దగా పడటం లేదని టాక్. ఇక నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. మొన్న వరదలకు రోడ్లు ఎక్కువగానే డ్యామేజ్ అయ్యాయి. అటు ఆవ భూముల విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక రాజకీయ పరంగా చూసుకుంటే రాజా బాగా బలంగా ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదు. టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్ బాగా వీక్‌గా ఉన్నారు. పైగా ఆయన ఓడిపోయాక హైదరాబాద్‌కు వెళ్ళిపోయి, సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. కనీసం.. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. దీంతో రాజానగరంలో టీడీపీ కేడర్ రాజా వైపుకు వెళ్లిపోతుంది. టోటల్‌గా అయితే రాజానగరంలో రాజాకు తిరుగులేదనే చెప్పొచ్చు.
అధికార వైసీపీలో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ ఎమ్మెల్యేల్లో జక్కంపూడి ఎమ్మెల్యే రాజా ఒకరు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వారసుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాజా, 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుంచి పోటీ చేసి, టీడీపీ నేత పెందుర్తి వెంకటేష్‌పై అదిరిపోయే విజయం సాధించారు. కాపు సామాజికవర్గానికి చెందిన రాజా, ఏడాది కాలంలోనే రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు.