ప్రస్తుతం ఒక్క టాలీవుడ్‌లోనే కాదు.. దేశం మొత్తం ఎదురు చూస్తున్న సినిమాల్లో దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఇటీవల ఈ సినిమాను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఈ సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోస్తాయని, సినిమాలో అవి కూడా కీలక పాత్ర పోషిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విడుదల గురించి వచ్చిన వార్తలను కొందరు కొట్టిపారేస్తున్నారు. ఈ సినిమా విడుదల చేయాలనుకునే సమయంలోనే జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ కూడా విడుదల అవుతుందని, దీని వల్ల ఈ సినిమా మార్కెట్ పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ చిన్న ఇంగ్లీషు పాట కూడా ఉంటుందట. ఈ పాట ఎన్‌టీఆర్‌ చేస్తున్న కొమరం భీం పాత్రపై ఆసక్తి చూపించే ఒలీవియా మొర్రిస్ కేరక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ వార్తలు వచ్చిన క్షణం నుంచి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పాట ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను ఆకర్షిండమే జక్కన్న ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో కూడా భారీ వసూళ్లను రాబట్టేందుకే రాజమౌలి ఈ ప్లాన్ చేశాడట. అయితే ఇంత వైరల్ అవుతున్న ఈ వార్తపై సినిమా టీం నుంచి ఎటువంటి స్పందనా లేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇది నిజమో కాదో కూడా తెలీదు.

మరింత సమాచారం తెలుసుకోండి: