నేషనల్ క్రష్ అనే ట్యాగ్ వినిపించగానే అందరికీ గర్తుకొచ్చే పేరు రష్మిక మందన్ననా మాత్రమే.ఆ మధ్యకాలంలో యానిమల్ బ్యూటీ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన త్రిప్తి డిమ్రీకి నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చినప్పటికి అది ఎన్నో రోజులు నిలవలేదు. పర్మినెంట్ నేషనల్ క్రష్ ట్యాగ్ మాత్రం ఇప్పటివరకు అయితే రష్మిక మందన్నా ఖాతాలోనే ఉంది.అయితే తాజాగా ఇలాంటి నేషనల్ క్రష్ ట్యాగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది కాంతార: చాప్టర్ 1 హీరోయిన్ కన్నడ నటి రుక్మిణీ వసంత్..తాజాగా తన కాంతార:చాప్టర్ 1 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఓ ఇంటర్వ్యూలో రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి వింటున్నాను ఈ నేషనల్ క్రష్ అనే ట్యాగ్ గురించి.

 అయితే నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి నేను ఎక్కువగా ఆలోచించను పట్టించుకోను.. ఎందుకంటే ఇలాంటి ట్యాగులు వినడానికి బాగుంటాయి. హ్యాపీనెస్ ని ఇస్తాయి. కానీ ఇలాంటి ట్యాగ్ లు కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనవి కావు.. కాలంతో పాటు సినిమా ఇండస్ట్రీలోకి ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఈ ట్యాగ్ కూడా ఒకరి నుంచి మరొకరికి మారిపోతూ ఉంటుంది. అందుకే నేను ఇలాంటి వాటిని పట్టించుకోను. ప్రేక్షకులకు దగ్గరగా ఉండి గుర్తింపు తెచ్చుకుంటే చాలు అనుకుంటా.. సప్తసాగరాలు సినిమాలోని ప్రియా పాత్ర ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులకు ఇష్టం.ఈ పేరుతోనే నన్ను చాలామంది ఇష్టపడతారు.

ఇంత సింప్లిసిటీ ఉన్న పాత్ర ని కూడా ప్రేక్షకులు ఇంత ఆదరించినందుకు వారికి ఎప్పటికీ కృతజ్ఞురాలిగానే ఉంటాను. అలాగే నన్ను ఈ పాత్ర ద్వారా గుర్తుపెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ నేషనల్ క్రష్  ట్యాగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఈ హీరోయిన్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ రష్మిక మందన్నాని ఉద్దేశించే రుక్మిణీ వసంత్ ఈ కౌంటర్ ఇచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి ప్రస్తావించి రష్మిక పరువు తీసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: