తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో కార్తికేయ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత ఏడాది పూర్తి కావాల్సిన సినిమా ఈ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇక లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్న తర్వాత కూడా ఓటీటీలకు ఆదరణ తగ్గడం లేదు. అటు బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్‏గా నిలిచి దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురించిన సినిమాలు మళ్లీ ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఇక ఈ జాబితాలోకి మరో యాంగ్ హీరో సినిమా కూడా రాబోతుంది. ఇటీవల ప్రేక్షకులను అలరించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చావు కబురు చల్లగా’.. ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ.. లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించగా.. డైరెక్టర్ కౌశిక్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఏప్రిల్ 26 నుంచి స్రీమింగ్ కానుట్లుగా ఆహా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్ పై అల్లు అర్జున్ సమర్పణలో బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.



అయితే సినిమా విషయానికి వస్తే.. శవాలను తీసుకెళ్లే వ్యాన్ డ్రైవర్ (బస్తీ బలరాజు).. మెటర్నటీ నర్స్ (మల్లిక) భర్త శవాన్ని తీసుకురావడానికి వెళ్లి… ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఇక తన అల్లరితో మల్లికను ఇబ్బందులు పెడుతూ ఆమె వెంటపడతాడు. ఇక మల్లిక తన భర్త ఆలోచనల నుంచి బయటకు రాలేక.. తన వెంటపడుతున్న బాలరాజుని అసహ్యించుకుంటుంది. అలాంటి మల్లిక.. బాలరాజు ప్రేమలో ఎలా పడింది? బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దారితీసిన పరిస్థితులు ఏంటి? అనేదే సినిమా. ఇందులో భర్తను కోల్పోయిన మహిళ పాత్రలో లావణ్య జీవించేసింది అని చెప్పుకోవాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: