ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యాడు కార్తికేయ. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ పాత్రలో తాను తప్ప ఎవరు నటించే లేరు అన్న రీతిలో కార్తికేయ నటించి ప్రేక్షకులను ఆకట్టుకోగా తొలి సినిమాతోనే ఈ హీరో ఈ రేంజ్ హిట్ అందుకుని నటుడి గా తనని తాను నిరూపించుకున్నాడు. ఈ స్థాయిలో ఫ్యాన్ తిన్న తర్వాత కార్తీక కు తెలుగులో వరుస మంచి సినిమాలు రావడం మొదలయ్యాయి.

ఆ విధంగా ఆయన మంచి మంచి సినిమాలు ఎంపిక చేసుకున్నాడు. అయితే అవి ప్రేక్షకులను మెప్పించడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి. ఆయన చేసిన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరచడంతో కొంత వెనుకబడి నట్లు అయ్యింది ఆయన కెరీర్. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటివరకు తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇటీవల అయన చేసిన చావుకబురు చల్లగా సినిమా కూడా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది. అయితే నటుడిగా కార్తికేయ ఎప్పుడు ప్రేక్షకులను నిరాశ పరచ లేదు. 

ప్రస్తుతం రాజా విక్రమార్క అనే ఓ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని చేస్తున్నాడు కార్తికేయ. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా అది చాలా బాగుంది అని ప్రశంసలు ప్రేక్షకుల దగ్గరనుంచి అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో మళ్లీ కార్తికేయ ఫామ్ లోకి వస్తారా అనేది చూడాలి.  ఇకపోతే ఆయన కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఇప్పటికే నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా లో ఆయన విలన్ గా నటించాడు. ఈ సినిమాలో ఆయన చూపించిన విలనిజానికి భారీ స్పందన వచ్చింది. ఇప్పుడు తమిళంలో క్రేజీ చిత్రం గా వాలిమై సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. కార్తికేయ హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న కార్తికేయ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పాత్రలలో నటిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: