‘రాథే శ్యామ్’ విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఈమూవీ పై సందేహాలు రకరకాల కారణాలతో మరింత పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట కూడ ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవడంతో ఈమూవీ నిర్మాతల పై ప్రభాస్ అభిమానుల అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ అసహనాన్ని గ్రహించిన ప్రభాస్ అభిమానులు ఎట్టకేలకు ఈమూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోష్టర్ విడుదల చేసారు.


ఈ పోష్టర్ విడుదల తరువాత ఈమూవీ పై అభిమానులలో మరిన్ని కొత్త సందేహాలు మొదలయ్యాయి. గతంలో ప్రభాస్ నటించిన ‘సాహో’కు సంగీత దర్శకుల విషయంలో విపరీతమైన గందరగోళం జరిగిన విషయం తెలిసిందే. ఈసినిమాకు వేరువేరు మ్యూజిక్ డైరెక్టర్స్ చేత పాటలు ట్యూన్ చేయించి విడుదల చేయడం వల్ల ఆమూవీకి అప్పట్లో అపారమైన నష్టం జరిగింది. ఇప్పుడు కూడ మళ్ళీ ‘రాథే శ్యామ్’ విషయంలో అదే జరిగింది.


‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ జస్టిన్ ప్రభాకరన్‌ ను ఈమూవీకి సంగీత దర్శకుడుగా ఫైనల్ చేసి  హిందీ వెర్షన్‌కు వేరే మ్యూజిక్ డైరెక్టర్‌ ను ఖరారు చేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఈమూవీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతను వేరే సంగీత దర్శకుడుకు అప్పగించారు అని అంటున్నారు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కు దగ్గర అవుతున్న పరిస్థితులలో ఈ నెల 15న ‘రాధే శ్యామ్’ నుండి ఫస్ట్ సాంగ్ విడుదల  అయింది .. దీనికి సంబంధించిన ఒక పోష్టర్ ఇప్పుడు అనేక సందేహాలకు అవకాశం కల్పిస్తోంది.


ఈమూవీ మొదటి పాటకు సంబంధించిన అప్‌ డేట్ పోస్టర్లో తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలు మాత్రమే పేర్కొన్నారు హిందీ గురించి ప్రస్తావన లేదు. దీనితో ఇప్పుడు రిలీజ్ చేస్తున్న పాట దక్షిణాది భాషలకే పరిమితమా హిందీలో ఉండదా అన్న సందేహం అభిమానులకు కలుగుతోంది. అంతేకాదు ‘రాథే శ్యామ్’ హిందీ రిలీజ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా సంక్రాంతికి దక్షిణాది భాషలలో రిలీజ్ చేసి బాలీవుడ్ లో విడుదల చేయరా అంటూ అభిమానులలో కొత్త సందేహాలు మొదలయ్యాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: