సినీ పరిశ్రమలలో హీరో లు మరియు హీరోయిన్స్ తమకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. అభిమానులను సంపాదించుకోవడానికి శక్తివంచన లేకుండా కష్టపడుతూ ఉంటారు. వారిని వారు ఎంతగానో మలచుకొంటారు. ఈ క్రమం లోనే వారు అభిమానులకు నచ్చేవిధంగా కనిపించడానికి ఎంతగానో ఖర్చు చేస్తూవుంటారు. అయితే వారు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. హీరో, హీరోయిన్ లు దాదాపుగా రూ. 50 కోట్ల రూపాయలకు అటుఇటుగా వారి పారితోషకం తీసుకుంటూవుంటారు . హీరో లు హీరోయిన్ లు తీసుకునే రెమ్యూనరేషన్ తో పోల్చుకుంటే హెయిర్ స్టైలిస్ట్ లు , కాస్ట్యూమ్ డిజైనర్లు తీసుకునే పారితోషకం చాల తక్కువ అయినప్పటికీ సినిమా పూర్తి అయ్యేసరికి ఖర్చు పరంగా సినిమా పై భారీగానే భారం పడుతుంది.

మెగా ఫామిలీ నుండి మెగా వారసుడిగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఏ పాత్రను తీసుకున్నా ఆ పాత్రకు న్యాయం చేసేవిధంగా అతని నటన ఉంటుంది. అంతే కాకుండా అతని హెయిర్ స్టైల్ కూడా ప్రతి సినిమాలో వైవిధ్యంగా కనబడుతుంది . రామ్ చరణ్ స్టార్ హీరో గా ఉంటూనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దర్శకుడు శంకర్ పర్యవేక్షణలో RC -15 లో  రామ్ చరణ్ నటించబోతున్నాడు . ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు . అయితే ఈ సినిమాకి దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ ని అనుకుంటున్నారు. శంకర్ తో ఆంటే మాటలు కాదు అనుకున్నదానికి బడ్జెట్ కంటే  ఎక్కువ గని తక్కువ గాని అయ్యేఅవకాశం లేకపోలేదు.

 
దిల్ రాజు, రామ్ చరణ్ మరియు శంకర్ కాంబోలో వస్తున్నా ఈ చిత్రం లో రామ్ చరణ్ లుక్ చాల డిఫెరెంట్ గా కనిపించనుంది. రామ్ చరణ్ హెయిర్ స్టైల్ కోసం ప్రత్యేకంగా స్టైలిస్ట్   ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ హెయిర్ స్టైలిస్ట్  ని  ముంబై నుండి ప్రత్యేకంగా హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. అతడికి ఒక్కరోజుకు  రూ. 1.50   లక్షల నుండి రూ. 2  లక్షలవరకు చెల్లించనున్నారు. అంతే కాకుండా వారికీ బిజినెస్‌ క్లాస్‌ ఫ్లయిట్‌ టికెట్‌ ను మరియు  స్టార్‌ హోటల్‌ లో సూట్ రూమ్ ని బుక్ చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా ఆ స్టైలిస్ట్ క్రింద ముగ్గురు అసిస్టెంట్స్ ని కూడా నియమించనుంది. శంకర్ , చరణ్ సినిమా పూర్తి అయ్యే సరికి వారికీ కోటి రూపాయల కంటే ఎక్కువగానే ఖర్చు అవ్వనుంది.




మరి పాన్ ఇండియా సినిమా  అంటె ఆ మాత్రం ఖర్చు ఉండాల్సిందే. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వం లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. RC _15 లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించనుంది. రామ్ చరణ్ కి అసిస్టెంట్ పాత్రలో కనిపించనుంది. దిల్ రాజు  ..శంకర్ మరియు రామ్ చరణ్ సినిమా పై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: