కొత్తగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో మన రంగమ్మత్త ఎయిర్ హోస్టెస్ గా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో తనది కేవలం ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ మాత్రమే కాదని.. నటనకు అవకాశం ఉందని చెబుతోంది అనసూయ. తాను ఈ మూవీలో నటన ఇరగదీశానని తన ఫ్రెండ్స్ కు చెప్పుకుంటోందట అనసూయ. ఈ మూవీలో తన క్యారెక్టర్ చూసి అందరూ షాకవుతారని కూడా చెప్పుకొచ్చింది. అందరూ పుష్ప మూవీలో దాక్షాయణి పాత్ర తనకు పేరు వస్తుందని అనుకుంటున్నారని.. అయితే అంతకు మించి ఈ ఎయిర్ హోస్టెస్ పాత్ర తనకు పేరు తీసుకు రాబోతోందని అంటుంది అనసూయ.
జబర్దస్త్ తో పాటూ టీవీ షోల ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నానని చెప్పింది ఈ బ్యూటీ. తాను సినిమాల్లో నటించేది డబ్బుకోసం కాదని.. సినిమాల్లో వచ్చే డబ్బు తనకు అవసరం లేదని.. పేరు తీసుకొచ్చే పాత్రలు చేస్తే చాలంటోంది. ఏమో.. ఒక సినిమా గురించి రంగమ్మత్త ఇంతగా చెబుతోందంటే ఆ మూవీలో ఏ రేంజ్ పర్ఫామెన్స్ ఇరగదీసి ఉంటుందోనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. బుల్లితెరపై తన అందచందాలను ఆరబోసే అనసూయకు.. ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ చక్కగా సరిపోతుందని, ఆమె ఫిజిక్ అందుకు కరెక్ట్ గా సెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.