యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి బాక్సాఫీసు వద్ద వసూళ్లతో దూసుకుపోతోంది. నందమూరి అభిమానులకు  ఆక‌లి అఖండ తీర్చేసిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా తమ అభిమాన హీరో బాలయ్య వందకోట్ల క్లబ్ లో చేరాలని బాల‌య్య అభిమానులు ఆరాట పడుతున్నారు. అయితే అఖండ 10 రోజులకే వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ వయస్సులో నూ బాలయ్య స్టామినా ఏమాత్రం తగ్గలేదని అఖండ మరోసారి ప్రూవ్ చేసింది.

బోయపాటి బాలయ్య కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వడంతో పాటు ... బాలయ్య అభిమానుల అక‌లి ఒక్క సినిమాతో తేర్చేశాడు. ఇక అఖండ చూసిన బాలయ్య అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసుకుని మరి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం పెద్ద హైలెట్ అన్న విషయం తెలిసిందే. రికార్డింగ్ కే థ‌మ‌న్ 44 రోజులు కష్టపడ్డాడు అంటే ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉందో అర్థమవుతుంది.

అయితే అఖండ పాత్రలో బాలయ్య ఒక చక్రాన్ని చేత పట్టుకుని ప్రత్యర్థులను చీల్చి చెండాడే ఒక ఫైట్  ఉంది. ఈ సీన్ కు థ‌మ‌న్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా బాగా ఎలివేట్ అయ్యేలా చేసింది . బోయపాటి మదిలోనే ఈ చక్రం ఆలోచన వచ్చిందట. అయితే బాలయ్య గతంలో కూడా దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమాలో చక్రం ప‌ట్టుకుని మ‌హా భార‌త యుద్ధం చేశారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన దానవీరశూరకర్ణ సినిమా లో బాలయ్య అభిమన్యుడిగా నటించారు.

అప్పుడు చక్రం యుద్ధం చేసిన బాలయ్య .. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి బండి చక్రం పట్టుకొని సినిమాలో ప్రత్యర్థులను చీల్చి చెండాడ తాడు. ఏదేమైనా 44 సంవత్సరాల తర్వాత బాలయ్య చేత చక్రం పట్టించి ఫైట్ సీన్ పెట్టి అదరగొట్టిన ఘనత బోయపాటి శ్రీను కే దక్కుతుందని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: