పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్,  ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా, దగ్గుబాటి రానా సరసన సయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన  అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. భీమ్లా నాయక్  సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది, అలాగే ఈ సినిమా నుండి కొన్ని పాటలను కూడా చిత్ర బృందం విడుదల చేసింది, ఈ పాటలు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.  

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అరుణ్‌ కౌండిన్య పాడిన ‘లా లా భీమ్లా’ అనే పాట యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ఈ సాంగ్ ను మళ్లీ మళ్లీ వింటున్నానంటోంది యంగ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌, ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు, ఈ సందర్భంగా నిధి అగర్వాల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై ఈ ముద్దుగుమ్మ ప్రశంసల వర్షం కురిపించింది, ఇక మీకు ఇష్టమైన పాట ఏది అని ఒక నెటిజన్ నిధి అగర్వాల్ అని అడగగా.. ఈ ప్రశ్నకు స్పందించిన నిధి అగర్వాల్ 'భీమ్లా నాయక్' సినిమాలోని ‘లా లా భీమ్లా’ సాంగ్ అని చెప్పింది. ఈ సాంగ్ ను మళ్ళీ మళ్ళీ వింటున్నాను అని నిధి అగర్వాల్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: