దర్శకదీరుడు రాజమౌళి చిత్రీకరించిన rrr సినిమా విడుదల ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను జనవరి 7న మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుందని భావించిన అటు రాజమౌళి అండ్ టీం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. దేశంలో రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో rrr సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండటంతో భారీగా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. ఇక బాలివుడ్ గుండె అయిన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు వంటి నగరాల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమా ప్రమోషన్స్ లో హీరోయిన్ ఆలియా భట్ కూడా పాల్గొన్నారు.

ఇక కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడటం ఇది మూడోసారి. ఇక ఇఫ్పటికే షూటంగ్ సమయంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతూనే రాగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి ప్లానింగ్‌ కు కరోనా దెబ్బ వేయడంతో, ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉందని చెప్పాలి. ఈ చిత్ర నిర్మాత దానయ్య rrr సినిమా ప్రమోషన్స్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు.

సినిమా నిర్మాత ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఏకంగా 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సినిమా వర్గాల్లో వినిపిస్తుంది. దీనికి సంబంధించిన విషయాలను సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు తెలిపారు. అయితే  RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అతడు పెద్ద బాంబు  పేల్చారనే చెప్పాలి మరి. ఇక ఈ సినిమా మరోసారి విడుదల వాయిదా పడటంతో ఇప్పటి దాకా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ వృధా అయినట్టేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి  RRR ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్లేనని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: