- పేద కుటుంబం నుంచి 10 దేశాల్లో కంపెనీల ఓన‌ర్‌షిఫ్ వ‌ర‌కు
- బాబు, లోకేష్ ఆహ్వానం మేర‌కు టీడీపీ త‌ర‌పున పొలిటిక‌ల్ ఎంట్రీ
- టీడీపీ హ్యాండ్‌తో వైసీపీలోకి.. వెంట‌నే రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి
- ఫ్యూచ‌ర్ ఏపీ పాలిటిక్స్‌లో కీల‌క యాద‌వ నేత‌గా ఎదిగే స్కోప్‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

గోరుముచ్చు గోపాల్ యాద‌వ్ ప్ర‌స్తుతం ఈ పేరు ఏపీ ఎన్నిక‌ల వేళ ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో బాగా పాపుల‌ర్ అయ్యింది. బీసీల్లో యాద‌వ క‌మ్యూనిటీకి చెందిన గోపాల్ యాద‌వ్ చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలోని కామ‌వ‌ర‌పుకోట మండ‌లం కంఠ‌మ‌నేనివారి గూడెం. చిన్న దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన గోపాల్ ఐటీ రంగంలో, రియ‌ల్ ఎస్టేట్ రంగంలో సుమారు 10 దేశాల్లో త‌న కంపెనీల సేవ‌లు విస్త‌రించారు. బీసీల్లో ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్న నేత కావ‌డంతో ప్ర‌తిప‌క్షంలో.. అందులో క‌ష్టాల్లో ఉన్న తెలుగుదేశం ఎన్నారైల‌ను టార్గెట్ చేసే క్ర‌మంలోనే గోపాల్ యాద‌వ్‌పై గురిపెట్టింది. లోకేష్‌, బాబు ఆహ్వానం మేర‌కే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గోపాల్ ముందుగా సీటేమి ఆశించ‌లేదు. త‌న ప‌ని తాను చేసుకుపోతూ వ‌చ్చారు.


ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ లేదా ఎంపీ సీటు ఇస్తాన‌ని కూడా ప్ర‌తిపాద‌న పెట్టారు. చివ‌ర‌కు పార్ల‌మెంటుకు పోటీ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది వాళ్లే. ఒక్క‌టి మాత్రం వాస్త‌వం... గోపాల్ టీడీపీలో చేరిన త‌ర్వాత చింత‌ల‌పూడి, పోల‌వ‌రంతో పాటు ఏలూరు పార్ల‌మెంటులో ఊపు రావ‌డానికి కార‌ణ‌మైన వారిలో ఆయ‌న పాత్ర కూడా ప్ర‌ముఖం. ఆర్థికంగా ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఖ‌ర్చు పెట్టి.. చేతిక ఎముక‌లేని దాత‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. క‌ట్ చేస్తే చంద్ర‌బాబు ఆయ‌న‌కు బ‌దులుగా రాయ‌ల‌సీమ నుంచి దిగుమ‌తి చేసుకున్న పుట్టా మ‌హేష్ యాద‌వ్‌కు ఏలూరు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.


తాను త‌న మానాన వ్యాపారాలు చేసుకుంటూ విదేశాల్లో ఉంటే ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి అన్యాయం చేశార‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. క‌ష్ట‌ప‌డినా శ్ర‌మంతా వృథా కాకూడ‌దు.. వెంట‌నే వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్క‌డ మాత్రం ఊహించ‌ని ప్ర‌మోష‌న్లు ద‌క్కాయి. పార్టీలో చేరిన వెంట‌నే పార్టీ ప్రొటోకాల్ ప‌రంగా అత్యంత కీల‌క‌మైన రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అలాగే చింత‌ల‌పూడి, నూజివీడు నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల ప‌రీశీల‌కుడిగా బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టారు.


నిజం చెప్పాలంటే రాజ‌కీయంగా యాద‌వ క‌మ్యూనిటీలో ఎంతోమంది త‌ల‌లు పండిన నాయ‌కులు ఉన్నారు. ఎన్నారైగా ఉన్న గోపాల్ తెలుగు రాజ‌కీయాల‌ను వంట ప‌ట్టించుకుంటారా ? ఇక్క‌డ స‌మ‌స్య‌లు, రాజ‌కీయాల‌పై ఆయ‌న‌కు అవ‌గాహ‌న ఉందా ? అన్న డౌట్లు ప‌టాపంచ‌లు చేస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. చంద్ర‌బాబు మాట‌మీద నిల‌క‌డ‌లేని త‌నాన్ని హైలెట్ చేస్తూ విమర్శ‌లు చేయ‌డంతో పాటు ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలో యాద‌వ‌, గొల్ల ప‌ల్లెలు, క‌మ్యూనిటీ సంఘాల‌తో మీటింగ్‌లు పెడుతూ వారిని రాజ‌కీయంగా చైత‌న్య వంతుల‌ను చేస్తూ వ‌స్తున్నారు.


నిజంగా గోపాల్ యాద‌వ్‌ను వైసీపీ గుర్తించింది.. క‌మ్యూనిటీలోనే కాకుండా.. గోపాల్ ఇదే స్పీడ్‌తో రాజ‌కీయం కంటిన్యూ చేస్తే వ‌చ్చే ఐదేళ్ల‌లో.. ఇంకా చెప్పాలంటే 2029 ఎన్నిక‌ల నాటికి యాద‌వ క‌మ్యూనిటీలో ఏపీలో కీల‌క‌మైన రాజ‌కీయ నేత‌గా ఎదిగే స్కోప్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: